వివిధ పార్టీల జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. ఆంధ్రపదేశ్ లోని 10 జిల్లాల్లో టీడీపీ అభ్యర్థులు జడ్పీ చైర్మన్లుగా ఎన్నికయ్యారు. వైఎస్సార్ జిల్లా జడ్పీ చైర్మన్ సీటును వైఎస్సార్ సీపీ కైవసం చేసుకుంది. ప్రకాశం, నెల్లూరు జిల్లా పరిషత్ ఎన్నికలు మాత్రం టీడీపీ సభ్యుల ఆందోళనతో వాయిదా పడ్డాయి. ఇదిలా ఉండగా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగింది. ఆరు చోట్ల జడ్పీ చైర్మన్లను టీఆర్ఎస్ కైవసం చేసుకోగా, నల్గొండ జడ్పీ స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది. రంగారెడ్డి జిల్లా అభ్యర్థి ఎన్నిక వాయిదా పడింది. హైకోర్టు స్టే విధించడంతో ఖమ్మం జడ్పీ చైర్మన్ ఎన్నిక నిలిచిపోయింది. శనివారం జరిగిన ఈ ఎన్నికల్లో విజేతల వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీ చైర్మన్లుగా ఎన్నికైనవారు:- ---------------------------------------------- విశాఖ- లాలం భవానీ(టీడీపీ) కృష్ణా-గద్దె అనురాధ(టీడీపీ) తూ.గో-నామన రాంబాబు(టీడీపీ) ప.గో-ముళ్లపూడి బాపిరాజు(టీడీపీ) గుంటూరు-షేక్ జానీమూన్(టీడీపీ) చిత్తూరు-ఎన్‌.గీర్వాణీ(టీడీపీ) కర్నూలు-రాజశేఖర్‌గౌడ్‌(టీడీపీ) అనంత-దూదేకుల చమన్‌(టీడీపీ) శ్రీకాకుళం-చౌదరి ధనలక్ష్మి(టీడీపీ) విజయనగరం-స్వాతీరాణి(టీడీపీ) వైఎస్సార్ జిల్లా-గూడూరు రవి(వైఎస్సార్ సీపీ) తెలంగాణలో జెడ్పీ చైర్మన్లుగా ఎన్నికైనవారు:- ----------------------------------------------- ఆదిలాబాద్‌-వి.శోభారాణి(టీఆర్ఎస్) నిజామబాద్‌-రాజు(టీఆర్ఎస్) కరీంనగర్‌-తుల ఉమ(టీఆర్ఎస్), మెదక్‌-రాజమణి(టీఆర్ఎస్) నల్గొండ-బాలూనాయక్(కాంగ్రెస్‌) వరంగల్‌-పద్మ(టీఆర్ఎస్) మహబూబ్‌నగర్‌-బండారి భాస్కర్‌(టీఆర్ఎస్)

మరింత సమాచారం తెలుసుకోండి: