హైదరాబాద్: రాష్ర్ట వ్యాప్తంగా పలు దేవాలయాల్లో చోరీకి పాల్పడుతున్న సాహు అనే కరుడుగట్టిన దొంగను రంగారెడ్డి జిల్లా ఉప్పల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలందుతున్నాయి. గతంలో విజయవాడ కనకదుర్గమ్మ దేవాయలంలో కూడా సాహు చోరీకి పాల్పడ్డాడు. తాజాగా నగరంలోని పాతబస్తీలో గల ప్రసిద్ది చెందిన మహంకాళీ ఆలయంలో కూడా గత రెండ్రోజుల కిందట చోరీ జరిగిన విషయం విధితమే. ఈదొంగతనంపై పోలీసులు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సాహు అనే ఘరాన దొంగ ఉప్పల్ పోలీసులు అదుపులోకి తీసుకుని, సీసీఎస్ పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది. పాతబస్తీలోని మహంకాళీ దేవాలయంలో కూడా సాహు దొంగతనానికి పాల్పడి ఉండవచ్చనీ పోలీసులు ఆదిశగా తమ విచారణను మొదలుపెడుతున్నారు. ఇదిలా ఉంటే, మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు శంకర్రావుపై ఉన్న అరెస్టు వారెంటు పై స్టేను హైకోర్టు కొట్టివేసింది. గ్రీన్ ఫీల్డ్ భూముల వ్యవహారంలో శంకర్రావుకు చుక్కెదురయ్యింది. గతంలో ఆయనపై నమోదు అయిన కేసుకు సంబంధించి అరెస్ట్ వారెంట్ పై స్టేను హైకోర్టు కొట్టివేసింది. దీనితో శంకర్రావును ప్రశ్నించేందుకు సైబరాబాద్ పోలీసులు రంగం సిద్ధం చేశారు. శంకర్రావుతో పాటు ఆయన కుమారుడు దయానంద్ను కూడా పోలీసులు ప్రశ్నించనున్నారు. అల్వాల్‌ మున్సిపల్‌ పరిధిలోని కనాజిగూడ గ్రామానికి చెందిన 875ప్లాట్లను రెగ్యులరైజ్‌ చేసే విషయంలో గ్రీన్ ఫీల్స్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్కు చెందిన 75 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారంటూ శంకర్రావుపై కాలనీవాసులు ఫిర్యాదు చేసిన విషయం విధితమే.     

మరింత సమాచారం తెలుసుకోండి: