చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి పెళ్లి కూతురవుతోంది. ఈనెల 13వ తేదీన ఎప్ట్రానిక్స్ ఎండి దాసరి రామకృష్ణ తనయుడు అన్వేష్‌తో జరుగుతుంది. విజయవాడ నగరం 'ఏ కన్వెన్షన్ సెంటర్'లో అంగరంగ వైభవంగా జరుగుతుంది. హంపి తండ్రి కోనేరు అశోక్ భార్య కుటుంబ సభ్యులతో శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును తమ కూతురి వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. ఆయన ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అభివృద్ధి కోసం రూ. 2 లక్షల విరాళం ముఖ్యమంత్రికి అందజేశారు. చదరంగంలో కోనేరు హంపి అంతర్జాతీయ స్థాయిలో మూడో స్థానంలో ఉంది. ఇటీవలే అన్వేష్‌, కోనేరు హంపి నిశ్చితార్థం జరిగింది. వివాహమైన తర్వాత కూడా ఆమె చదరంగ పోటీల్లో పాల్గొంటుందని తెలిసింది. 1987 మార్చి 31వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుడివాడలో జన్మించిన కోనేరు హంపి భారతదేశ ప్రముఖ చదరంగ క్రీడాకారిణిగా నిలిచింది. 2007 అక్టోబర్ లో ఫైడ్ఎలో రేటింగ్‌లో 2600 పాయింట్లు దాటి మహిళా చదరంగంలో జూడిత్ పోల్గర్ తర్వాత ప్రపంచంలో రెండో స్థానంలో నిల్చింది. ఈ స్థానం సంపాదించిన భారతదేశపు తొలి చెస్ క్రీడాకారిణి హంపి. మహిళా గ్రాండ్ మాస్టర్లలోనే కాదు మొత్తం గ్రాండ్ మాస్టర్లలో అతి పిన్న వయస్కురాలైన గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన రికార్డు హంపి సొంతమైంది. కేవలం 15 ఏళ్ల అతిపిన్న వయస్సులోనే హంపి ఈ స్థానానికి ఎదిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: