ఒక పాదం నీది ఒక పాదం నాది సాగే పయనం మన ఇద్దరిది ఒక చరణం నీది ఒక చరణం నాది ఆలపించే గానం మన ఇద్దరిది ఒక నయనం నీది ఒక నయనం నాది చూసే చూపు మన ఇద్దరిది ఒక అక్షరం నీది ఒక అక్షరం నాది కలిస్తే వచ్చే అర్ధం మన ఇద్దరిది ఒక స్వరం నీది ఒక స్వరం నాది ధ్వనించే రాగం మన ఇద్దరిది ఒక మననం నీది ఒక మననం నాది గుర్తొచ్చే జ్ఞాపకం మన ఇద్దరిది ఒక అదరం నీది ఒక అదరం నాది మధురమైన చుంబనం మన ఇద్దరిది ఒక ప్రాణం నీది ఒక ప్రాణం నాది బ్రతకాల్సిన జీవితం మన ఇద్దరిది

మరింత సమాచారం తెలుసుకోండి: