క్యాబినెట్‌ విస్తరణ దిశగా నరేంద్ర మోడీ, అమిత్‌షాలు కసరత్తు చేస్తున్నట్లు వి శ్వసనీయ సమాచారం. మరో వారం రోజుల్లో కేంద్ర క్యాబి నెట్‌ విస్తరణ ఉంటుందని బిజెపి పార్టీ వర్గాల నుంచి అందు తున్న సమాచారం. అయితే ఈ సారి క్యాబినెట్‌లో మోడీ అమిత్‌షాల ముద్ర స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ముగిసిన నేపథ్యంలో ఇక పాలనపై మోడీ పూర్తిగా దృష్టి పెట్టనున్నారు. ప్రస్తుతం మెడీ క్యాబినెట్‌లో కేవలం 45 మంది మంత్రులు మాత్రమే ఉన్నా రు. అయితే ప్రస్తుతం పార్లమెంటులో ఉన్న సభ్యుల సంఖ్య నేపథ్యంలో 80మంది వరకు తన క్యాబినెట్‌ సంఖ్యను పెంచుకునే అవకాశం ఉంది. అలా జరిగితేనే పూర్తిగా అన్ని శాఖలు పనిచేస్తేనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయి. ప్రస్తుతం తాత్కాలికంగా ఒకొక్కొ మంత్రికి 3 నుంచి 5శాఖలను కేటాయించారు. ఇది ఒకరకంగా భారమనే చెప్పాలి. గతంలో యూపిఏ మాదిరిగా కాకుండా ప్రస్తుతం ఎన్‌డిఏ సర్కారు సహాయమంత్రులకు కూడా కొన్ని బాధ్యతలు అప్పగించటం చేస్తుండటం మంచి పరిణామం. యూపిఏ 10యేళ్ళ కాలంలో దీనిపై మన్మోహన్‌ క్యాబినెట్‌లో మంత్రులు ఆందోళనలు కూడా చేసిన సంఘటనలు ఉన్నాయి. కానీ మోడీ అధికార వికేంద్రీకరణపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. అలాగే అందర్నీ నియంత్రించేందుకు కూడా వెనుకాడటం లేదు. మంత్రుల పిఎస్‌ల ఎంపిక.. బంధువులను ఎంపిక చేయకూడదనే అంక్షలు, గత సర్కారులో పనిచేసిన వారిని తీసుకోకూడదనే నిబంధనలు తొలుత పెట్టినప్పటికీ వాటిని క్రమేపీ తొలగించారు. గతంలో రాజు కాలం రాజు మారువేషంలో నగరాన్ని సందర్శించి తెలుసుకున్నట్లు మోడీ అత్యాధునికి టెక్నాలజీని ఉపయెగించి మంత్రుల కదలికలను గమనిస్తున్నారు. ఈసారి క్యాబినెట్‌ విస్తరణలో దక్షిణాది రాష్ట్రాలపై కన్నేసిఉంచారు. దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపిని బలోపేతం చేసేందుకు అమిత్‌షా గట్టి వ్యూహంతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో పూర్తిగా అధి కారం చేజిక్కించుకునేందుకు వ్యూహం ప న్నారు. ఈసారి జరగబోయే క్యాబినెట్‌ విస్తరణలో ఈ ఐదు రాష్ట్రాల్లోని బిజెపి నేతల పంట పండినట్లేనని చె ప్పుకోవచ్చు. అవకాశం ఉన్నంత వరకు ఎక్కువ మంది క్యాబినెట్‌లో చేర్చుకునేందుకు కసరత్తు జరుగు తున్నది. ప్రస్తుతం నరేంద్ర మోడీ క్యాబి నెట్‌లో తెలుగుదేశం పార్టీ నుంచి విమాన యానశాఖ మంత్రి పూసపాటి అశోక్‌గజపతి రాజు మాత్రమే ఉన్నారు. మరో రెండు మంత్రి పదవులను టిడిపి కేటాయిం చాలని నరేంద్ర మోడీ భావిస్తున్నారు. ఈ రెండు పదవుల కోసం ఎంపీలు నారా యణరావు, నిమ్మలకిష్టప్ప, గుండు సుధారాణి, శివప్రసాద్‌లు ప్రయత్నం చేస్తున్నారు. అయితే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఎంపి సుజనాచౌదరికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయ నకు ఒక పదవి వెళ్లిపోగా ఒక మంత్రి పదవినే ఈ నలుగురిలో ఒకరికి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే చంద్రబాబు నాయుడు నాలుగు మంత్రి పదవులు ఇవ్వాల ని, ఒక రాజ్యసభను తాము వదులుకునేందుకు సిద్దంగా ఉన్నామని మెడీకి చెప్పి ఆ స్థానాన్ని నిర్మలా శీతారామన్‌కు ఇవ్వటం జరిగింది.ఒక వేళ మోడీ నాలుగు పదవులు టిడిపి ఇస్తే సమస్య సునాయాసంగా పరి ష్కారం అయి పోతుంది లేదంటే ఒక్క పదవిని బాబు నలుగురు ఎంపీల్లో ఎవ రికి ఇస్తారనేది అంతుచిక్కని ప్రశ్న. ఇదిలా ఉండగా బిజెపి నుంచి ఆంధ్ర ప్రదేశ్‌లో ఇద్దరు మాత్రమే గెలుపొందారు. విశాఖ ఎంపీ హరిబాబు, నరసా పురం ఎంపీ గోక రాజు గంగరాజు ఇరువురిలో ఒకరికి మంత్రి పదవి దక్కే అవ కాశం ఉన్నట్లు వి శ్వసనీయ సమాచారం. ఆంధ్రప్రదేశ్‌ కోటాలో ఇప్పటికే వెం య్యనాయుడు, నిర్మలాసీతారామన్‌లు క్యాబినెట్‌లోఉన్నప్పటికీ వారిని జాతీయ నేతలుగా భా వించి మరోకరికి ఇక్కడి నుంచి క్యాబినెట్‌లో స్థానం కల్పించాలని బిజెపి భావి స్తుంది. తెలంగాణ నుంచి అసలు ప్రాతినిధ్యం లేకపోవటంతో అక్క డ నుంచి గెలుపొందిన ఏకైక సభ్యుడు బండారు దత్తా త్రేయను క్యాబినెట్‌లోకి తీసు కోవాలనుకున్నప్పటికీ ఆయనకు ఇటీవల బిజెపి పార్టీలో ఉపాధ్యక్ష పదవి ఇవ్వటం జరిగింది. ఇక తెలంగాణకు కేంద్రంలో ఏ విధంగా న్యాయం చేస్తారనేది వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: