రాష్ట్రం అధికారికంగా విడిపోయినప్పటికీ ఇంకా కొన్ని వ్యవస్థలు మాత్రం ఉమ్మడిగా పనిచేస్తున్నాయి. ఇలాంటి వాటిలోఒకటి హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం. ప్రభుత్వ అధికారిక ప్రాంతీయ చానల్ అయిన దూరదర్శన్ ను కూడా ఇప్పుడు విభజించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జావదేకర్ ఆంధ్రప్రదేశ్ కు కొత్త దూరదర్శన్ చానల్ ను మొదలు పెట్టనున్నట్టుగా ప్రకటించారు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ దూరదర్శన్ కేంద్రాన్ని మొదలు పెట్టనున్నట్లు ఆయన తెలిపాడు. దీంతో ఇన్ని రోజులూ హైదరాబాద్ దూరదర్శన్ ను చూసిన ఏపీ జనాలు ఇకపై విజయవాడ కేంద్రం నుంచి ప్రసారాలను చూడాల్సి ఉంటుంది. హైదరాబాద్ లోని దూరదర్శన్ కేంద్రం తెలంగాణ సొంతం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడే హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం ఏర్పాటు అయ్యింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక చానల్ గా కొనసాగుతోంది. సీమాంధ్ర సహిత ఆంధ్రప్రదేశ్ కు విజయవాడ రాజధానిగా ఖరారైన నేపథ్యంలో విజయవాడలోనే దూరదర్శన్ కేంద్రాన్ని నెలకొల్పాని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని ప్రకాశ్ జవదేకర్ వివరించారు. ఈయన ఈ వివరాలను తన ట్విటర్ అకౌంట్ లో పోస్టు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: