ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ ఏడాది 2012లో కూడా లక్షలు, వేల సంఖ్యలో ఇంజనీర్లు, డాక్టర్లను ఉత్పత్తి చేయనున్నది. శుక్రవారం విడుదల చేసిన ఎంసెట్ ఫతితాలు సంకేతలిస్తున్నాయి. గడిచిన కొద్ది సంవత్సరాలుగా రాష్ట్రం లక్షలు, వేల సంఖ్యలో ఇంజనీర్లు డాక్టర్లను ఉత్పత్తి చేస్తూ వస్తుంది. అంతేకాకుండా ఐ.ఐ.టి, త్రిపుల్ ఐ.టితో పాటు ఫార్మా, డెంటల్ రంగాలలో కూడా వేల మంది ప్రతి సంవత్సరం కళాశాలల నుంచి బయటకు వస్తున్నారు. రాష్ట్రం నుంచి ఏటా ఇంత మంది ఇంజనీర్లు, డాక్టర్లు, ఐ.టి నిపుణులు పుట్టుకురావడంపై దేశంలోనే కాదు అమెరికా ఆస్ట్రేలియా వంటి దేశలలో కూడ విస్తృత స్ధాయిలో చర్చ మొదలై ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు. ఇంత మందిని తయారు చేస్తున్న మన వృత్తి విద్య విధాన రహస్యం ఏమిటో ఛేదించటానికి అమెరికాకు చెందిన ఆర్ధిక వేత్త డెవిడ్ ఒల్సాన్ రాష్ట్రానికి విచ్చేసి పాఠశాలల్లో విద్యార్ధులను సంబోధించడం మొదలు పెట్టారు. సొంతదేశం అమెరికాలో ఒల్సాన్ ఇంతవరకు హైదరాబాద్ నుంచి వెళ్లిన వందలమంది ఇంజినీర్లను కలుసుకున్నరట. వారు ఎక్కడ నుంచి వచ్చారని వాకబు చేస్తే హైదరాబాద్ అని చెపితే ఇంతమందిని హైదరాబాద్ ఎలా ఉత్పత్తి చేస్తుందని ఆయనకు ఇప్పటికీ అంతుపట్టడం లేదు. అయితే ఏటా ఇంతమంది ఇంజనీర్లు, డాక్టర్లు కళాశాలల నుంచి బయటకు వస్తున్నారు, మరి వారికి ఉపాధి అవకాశాలను చూస్తే పరిస్ధితులు దారుణంగా ఉన్నాయని చెప్పవచ్చు. ప్రతి ఇంజనీరు డాక్టర్ అయిన ప్రతి ఒక్కరికి విదేశాల్లో అవకాశం దొరకదు. కొందరు మాత్రం భూమిని విడిచి వెళ్లాలంటే ఇష్టపడరు. ఇలా రకరకాల కారణాలతో చాలా మంది ప్రభుత్వ ఉధ్యోగంలో చేరి ప్రజా సేవ చేయలనే సంకల్పంతో కూడా ఉంటారు. ఈ నేపధ్యంలో ఈ ఏడాది ఇంజినీరింగ్లో పాస్ అయిన 3 లక్షల 21 వేల మంది అభ్యర్ధులకు 667కళాశాలలు, మెడిసిన్లో ఉత్తీర్ణత పొందిన 4956 మందికి 37 కాలేజీలు ఫార్మసీ కోర్సులో 29 వేల మందికి 271 కళాశాలలు, డెంటల్లో 1870 సీట్లకు 21 కళాశాలలు అతిధ్యం ఇవ్వటానికి ఈ కళాశాలల యాజమాన్యాలు సిద్దపడుతున్నాయన్నది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: