ప్రముఖులకు పెనుప్రమాదం తప్పింది. యుపిఎ రాష్ట్రపతి అభ్యర్ధి ప్రషబ్ ముఖర్జ్ ప్రచారం కోసం ఆదివారం జూబ్లీ హాల్లో ఏర్పాటు చేసిన సిఎల్పి సమావేశం పుర్తయిన అనంతరం అగ్ని ప్రమాదం సంభవించంది. సీఎల్ప సమావేశం అనంతరం ప్రణబ్ ముఖర్జీ మీడియాతో మాట్లాడి బయటకు వళ్ళిన సూమారు పది నిమిషాలలోపే జూబ్లీహాల్ వైభాగం నుంచి దట్టమైన పొగ హాల్లోకి కూడా వ్యాపించడంతో కొద్ది సేపు అక్కడ ఏమి జరుగుతుందో ఎవరికీ అర్ధం కాలేదు. క్షణాల్లో తేరుకున్న మంత్రులు, ఎమ్మెల్యేల, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, నాయకులు, అధికారులు, సిబ్బంది బయటకు పరుగుతీసారు. వందలాది మంది విఐపిలు ఉన్న చోట ఈ ప్రమాదం జరుగడంతో మంత్రలు , ప్రభుత్వాదికారులు ఆందోళనకు గురయ్యారు. జూబ్లీహాల్ భవనంపై ఉన్న ఎసి ప్లాంట్లో షాట్ సర్క్యూట్ కారణంగా అగ్గి రాజుకుని ఎసి మిషన్లకు నిప్పంటుకోవడంతోపాటు భవనంపై ఉన్న వాటర్ ప్రూఫ్ తారుషీటు కూడా కాలిపోవడంతో దట్టమైన పోగలు లేచాయి. విపరీతమైన పోగలు లేచాయి. విపరీతమైన పొగతో జూబ్లీహాల్ పరిసరాలతోపాటు ఎదురుగా ఉన్న వస్తీర్ణమైన మైదానం కూడా పొగతో నిండిపోయింది. దట్టమైన పొగమంచులా ఒక్కపారిగా పొగలు పబ్లిక్ గార్డెన్స్ ను కమ్మేశాయి. జూబ్లీహాల్లోపల ఉన్న ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్ది సాహసం చేసి హాల్ లోపల ఉన్న ఫైర్ సిలిండర్ ను తీసుకువెళ్ళి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు.దాదాపు 20 నిమిషాలు పాటు మంటలు చెలరెగగా అక్కడే ఉన్న ఫైర్ ఇంజన్ సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపు చేసి ఆర్పేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా ప్రణబ్ ముఖర్జీ పర్యటన షెడ్యుల్ కంటే 15 నిమిషాల కంటే ముందే జూబ్లీహాల్లో విచ్చేసి షెడ్యుల్ కంటే 20 నిమిషాల ముందే సమావేశాన్నిముగించుకుని అక్కడి నుంచి నిష్క్రమించారు. ఒక వేళ ప్రణబ్ ముఖర్జీ ఉండగానే అగ్ని ప్రమాదం జరిగి ఉంటే జరగరానిదేమేనా జరిగి ఉంటే పరిస్థితి ఏమటని తులచుకుని రాష్ట్ర కాంగ్రెస్ అధినాయకులు ఊహించకుని భయాందోళనకు గురయ్యారు. నిత్యం ప్రభుత్వానికి సంబంధించిన సమావేశాలు జరగడంతోపాటు సిఎంతోపాటు మంత్రులు, ఉన్నతాధికారులు వచ్చే జూబ్లీహాల్లో భధ్రత, రక్షణ చర్యలు తీసుకోవడంలో అధికారులు ఇంత సిర్లక్ష్యంగా ఉండడం పట్ల సమావేశానికి వచ్చిన ప్రముఖులంతా తీవ్రంగా ధ్వజమెత్తారు. శాసనసభ, శాసనమండలి భవనాలతో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, ఆడిటోరియంలు ఉన్న పబ్లిక్ గార్డెన్స్ ఆవరణలో శాశ్వత అగ్నిమాపక యంత్రం లేకపోవడం విచారకరమని ఎంపి జి.వివేక్, పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇంత సాంకేతిక పరిజ్ఞనం ఇంత పెద్దఎత్తున అభివృద్ది చెందినప్పటికీ జూబ్లీహాల్లో సరైన ఆగ్నిప్రమాద నివారణ, రక్షణ చర్యలు చేపట్టకపోవడం పట్ల ఎంపి వివేక్ తీవ్రంగా ప్రభుత్వ యంత్రాంగంపై మండిపడ్డారు. ఇప్పటికైనా పబ్లిక్ గర్డెన్స్ లో శాశ్వత ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఫ్రభుత్వని డిమాండ్ చేశారు. జూభ్లీహాల్లో రెగ్యుల్ మెయింటెనెన్స్ లో నిర్లక్ష్యం వల్ల అగ్నిప్రమాదం జరిగిందని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి చెప్పారు. సంఘటన అనంతరం ఆసనమండలి ఛ్తెర్మన్ డా|| ఎ.చక్రపాణి, శాసనసభ వ్యవహరాల మంత్రి డి.శ్రీధర్ బాబు సంఘటన స్థలాన్ని, అందుకు గల కారణాలను పరిశీలించారు. ఎసి యూనిట్లో స్పార్క్ కారణంగా యూనిట్ లోని ధర్మకోల్ తో పాటు భవనంపై ఉన్న తారుషీట్లు కాలిపోయి అగ్ని ప్రమాదం జరిగిందని శ్రీదర్ బాబు మీడియాకు చెప్పారు. ఈ అగ్ని ప్రమాదం వల్ల భవనానికి, రూఫ్ కు ఎలాంటి నష్టం జరగలేదని చెప్పారు.1936 లో నిర్మంచిన జూబ్లీహాల్ ఆర్కియాలాజి శాఖ పరిధిలో ఉందని, ఆ శాఖాధికారులను కూడా పిలిపించి ఇక్కడి పరిస్థితులను అంచనా వేయించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ప్రమాదం వల్ల శాసనమండలికి ఎలాంటి నష్టం జరగలేదని, అతి పురాతనమైన ఈ భవనాన్ని పరిరక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని డా|| చక్రపాణి చెప్పారు. పబ్లిక్ గార్డెన్స్ పరిథిలో శావ్వత ఫైర్ స్టేషన్ ను ఏర్పాటు చేసే విషయాన్ని ఆలోచిస్తామన్నారు. విచారణకు సిఎం ఆదేశం: జూబ్లీహాల్లో జరిగిన అగ్నిప్రమాదం విషయాన్ని తెలుసుకున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన విచారాన్ని వ్యక్తం చేశారు. సంఘటనపై విచారణకు సిఎం ఆదేశించారు. విచారణ అధికారిగా అజయ్ విశ్రాను నియమించారు.అగ్ని ప్రమాదం పై వెంటనే తనకు నివేదిక ఇవ్వాలని అజయ్ విశ్రను సిఎం ఆదేశించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: