అతి త్వరలో జగన్ని ఈ.డి ఢిల్లీకి తరలించనున్దనే సమాచారం వై కా పా లో గుబులు రేపుతోంది. అయన జైల్లో ఉన్నారని భాదపడ్డా హైదరాబాదులోనే ఉంచడం మూలాన మూలాఖత్ల పేరుతో జగన్తో ముఖ్య నేతలు విరివిగా సమవేశం అయ్యేవారు, కానీ ఈ వార్తతో వై కా పా శ్రేణులు నిరాసకు లోనవతున్నారు.  ఒకవైపు విజయ్ సాయి రేడ్డిని ఈ.డి ఢిల్లీకి పిలిపించడం, మరో వైపు షర్మిల యాత్రకు ఊహించినoతగా ప్రతిస్పందన లేక పోవడం , చంద్రబాబు మళ్లీ పున్జుకోవడం, జగన్ మూలాఖత్ల వివరాలు, జగన్ వద్ద ఉన్న జైలు సిబ్భండి కాల్రికార్డ్స్ కావాలని తే దే పా నేత యనమల రామకృష్ణుడు పెటిషేన్ , దీనికి తోడు రాష్త్రంలోనే చాలా జిల్లాల్లో సంస్తాగతంగా పార్టీని ఇంకా బలూపెతం చెయ్యలేకపోవడం లాంటి ఎన్నో సమస్యలు జగన్ పార్టీని వేధిస్తున్నాయి.  ఉత్తర తెలంగాణా నేతలు ఉప్పునూతల, ఇంద్రకిరణ్ రెడ్డిని,ఇంకా బాలకృష్ణను పార్టీ లోకి లాక్కోవడం లో సఫలమయినా , తెలంగాణా విషయంలో పార్టీ పరంగా ఏ నిర్ణయం తీసుకోకపోవడం పార్టీకి మైనస్ అయ్యాయి. ఇప్పుడు పార్టీ నమ్మకం అంతా తెలంగాణాలో తెరాస, కాంగ్రెస్,తేదేపాలోని అసంతుష్టుల పైనే. అయినా చంద్రబాబు యాత్ర దరిమిలా ఇదికూడా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చెప్పలేం. కొందరు పార్టీ నేతలేమో కొత్త వారిని లాక్కోవడం మాని ఇక క్షేత్రస్థాయిలో పార్టీని బలంగా తయారుచేసుకోవాలని బాహాటంగానే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: