ఉద్యోగాలకు వెళ్లేటప్పుడు ఇంట్లో చంటి పిల్లలను చూసుకోడానికి ఎవరైనా ఆయాలను పెట్టుకోవడం సహజం. అయితే, వాళ్లు ఎలాంటి వాళ్లో ముందే చూసుకోకపోతే మాత్రం ఇబ్బంది తప్పదు. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఉగాండాలో జరిగింది. ఎంతో గారాబంగా చూసుకోవాల్సిన చిన్న పిల్ల అన్నం సరిగ్గా తినట్లేదని ఏకంగా ఆమెను సోఫాలోంచి కిందకు విసిరేసి, టార్చిలైటుతో కొట్టింది. తర్వాత కాలుపెట్టి తొక్కేసింది, అంతేకాదు పాపను కాలితో అంతదూరం తన్నేసింది. ఇంకా కోపం తగ్గకపోవడంతో మళ్లీ అటూ ఇటూ తొక్కుకుంటూ వెళ్లింది. ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. దాంతో జాలీ తుముహిర్వే అనే ఆ ఆయాపై హత్యాయత్నం కేసు పెట్టారు. పిల్లలను ఎవరైనా ఇలా చేయడం చూస్తే తల్లిదండ్రులు ఇలాంటి ఆయాలను చంపేయాలని అనుకుంటారని ఉగాండా కార్మిక, సామాజిక అభివృద్ధి శాఖ మంత్రి మేరీ కరూరో ఓకురుట్ అన్నారు. అయితే ఈ తల్లిదండ్రులు మాత్రం అలా చేయకుండా చట్టాన్ని ఆశ్రయించారని చెప్పారు. డిసెంబర్ 8న సదరు ఆయాను కోర్టులో ప్రవేశపెడతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: