ఓబుళాపురం మైనింగ్ వ్యవహారంలో జైలు పాలైన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి ఎట్టకేలకూ బెయిల్ వచ్చింది. సీబీఐ ప్రత్యేక కోర్టు గాలికి, ఆయన వ్యాపార భాగస్వామ్యులకు బెయిల్ ను ఇస్తూ తీర్పునిచ్చింది. కొన్ని షరతులతో గాలికి బెయిల్ లభిచింది. మరి ఇప్పుడు గాలి విడుదల అవుతాడా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇది వరకూ కూడా గాలికి కొన్ని సెక్షన్ల విషయంలో బెయిల్ వచ్చింది. అయితే ఆయన జైలుకే పరిమితం కావాల్సి వచ్చింది. పేరుకే బెయిల్ అయినా గాలి దాదాపు రెండున్నర సంవత్సరం నుంచి జైలుకే పరిమితం అయ్యాడు. తాజాగా ఇనుపఖనిజాన్ని అక్రమంగా తరలించారనే అభియోగం విషయంలో గాలికి బెయిల్ లభించింది. అయితే గాలిపై ఉన్న అభియోగం ఇదొకటే కాదు. సీబీఐ చాలా సెక్షన్ల కింద గాలి పై కేసులు పెట్టింది. బెయిలు కోసం జడ్జికి లంచం ఇచ్చిన వ్యవహారం కూడా ఉంది. ఇలాంటి చాలా సెక్షన్ల కింద గాలి పై కేసులు నమోదయ్యాయి. మరి ఈ నేపథ్యంలో ఒక దానికింద బెయిల్ వచ్చినా.. మరో వ్యవహారంలో జైలుకే పరిమితం కావాల్సి వస్తోంది.ఈ పరంపరలో తాజాగా సీబీఐ ప్రత్యేక న్యాయ స్థానం గాలికి బెయిల్ ఇచ్చింది. మరి ఇప్పుడు జనార్ధన్ రెడ్డి విడుదల అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని సమాచారం. మరి ఆయన అదృష్టం ఎలా ఉందో!

మరింత సమాచారం తెలుసుకోండి: