సామజిక న్యాయం అంటూ పార్టీ పెట్టి , సీట్లన్నీ మావే అని ఊదరగొట్టి చివరికి ఇరవయ్ లోపు సీట్లోతో తృప్తిపడ్డ చిరంజీవి ఎట్టకేలకు తనకు కావలసింది నేరవేర్చుకోగలిగాడు. కాంగ్రేస్ పార్టీ లోకి తన పార్టీని కలిపేశాక ఇంకా తమకు హామీలు నిలబెట్టుకోలేదని అపుడప్పుడు అలక పాన్పు ఎక్కిన చిరు ఆఖరికి తను అనుకున్నది సాధించాడు. జగన్ చేసిన నష్థాన్ని పుడ్చుకోవడానికి కాంగ్రెస్ అంటోనీని రాయబారిగా పంపి తమ పార్టీలోకి విలీనం చెయ్యడానికి ఒప్పించింది. అప్పుడు మొదలు ప్రతి నెలా ఎదో ఒక విశేషమే. ఒక నెల కాంగ్రెస్ బెస్ట్ అనడం,మరో నెల తన అసంతృప్తి బయట పెట్టడం చిరుకి అలవాటుగా మారింది. ఒకానొక దశలో మళ్లీ ప్రజారాజ్యాన్ని పునరుర్ద్దర్రిస్తాడన్న భయం కలిగింది కాంగ్రెస్ వారికీ. ఇప్పుడు రాష్ట్రంలో రెండు పదవులు, కేంద్రంలో ఒక పదవి వెరసి చిరు మందహసం స్పష్టంగా కనిపించింది. ఈ వ్యవహరంలో ఎవ్వరు లాభ పడినా నష్టం మాత్రం తమదేనని చంద్రబాబు ఇప్పటికీ భాదపద్తుంటాడు. అనవసరంగా పార్టీ పెట్టి తనకు రావల్సిని వోట్లను చీల్చి, మరోమారు అధికారం కావాలనుకున్న బాబుకి చిరుని చూస్తే కోపం రావడం సహజమే! 

మరింత సమాచారం తెలుసుకోండి: