రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే విరివిగా ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి పెట్టుబడులు రావాలి.. రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామికీకరణ జరగాలి.. పరిశ్రమలు రావాలి.. కొత్త పరిశ్రమలు రావాలంటే భూమలు కేటాయించాలి.. ఆ పని చేయాలంటే భూమి సేకరించాలి. ఇక్కడే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కారణాలు ఏమైనా భూములు ఇచ్చేందుకు వాటి యజమానులు ముందుకు రావడం లేదు. ఏపీ రాజధాని దగ్గరనుంచి విశాఖలో ఏర్పాటు కానున్న పెట్రో రసాయనాలు, ఉత్పత్తుల పెట్టుబడుల కేంద్రం విషయంలోనూ ఇదే జరుగుతోంది.                               విజయవాడ- కాకినాడ మధ్య ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న ఈ పీసీపీఐఆర్ కోసం భారీగా భూమి సేకరించాల్సి ఉంటుందన్న వార్తలు ఆ ప్రాంత రైతుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు లక్ష ఎకరాల భూమి సేకరించబోతున్నారని వార్తలు వెలువడ్డాయి. దీని కారణంగా.. వేలాది మంది రైతులు, మత్స్యకారులు ఉపాధి కోల్పోతారని స్థానికులు భావిస్తున్నారు. ఐతే అధికార వర్గాల సమాచారం ప్రకారం ప్రభుత్వం లక్ష ఎకరాలు సేకరించబోదని.. కేవలం 8 వేల ఎకరాలుసేకరిస్తే సరిపోతుందని తెలుస్తోంది. ఈమేరకు ప్రజల సందేహాలు తీర్చేందుకు అధికారులు రెడీ అవుతున్నారు.                         విశాఖ జిల్లాలో దాదాపు లక్షన్నర ఎకరాల్లో పీసీపీఐఆర్ ఏర్పాటు చేయాలనుకున్న మాట వాస్తవమేనని అధికారులు అంగీకరిస్తున్నారు.. ఐతే.. అందులో కేవలం 65 వేల ఎకరాల్లోనే పరిశ్రమలు వస్తాయని వారు చెబుతున్నారు. ఇప్పటికే పాతిక వేల ఎకరాల్లో పరిశ్రమలు ఉన్నాయి. మరో 15 వేకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. మరో 15 వేల ఎకరాల భూమిని ఇప్పటికే పారిశ్రామిక వేత్తలు కొనుగోలు చేసుకున్నారు. కాబట్టి కేవలం 8 వేల ఎకరాల భూమిని సేకరిస్తే సరిపోతుందని అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: