ఆదిస్థానం ఇచ్చిన అభయ హస్తమో లేక, వెళ్లిపోతూ గంభిర్యమో తెలియదు కానీ మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం బాబుకు సవాలు విసిరాడు. ఎంత నష్టపోతేనేం, ఇన్నాళ్ళ తరువత జన స్పందన చూసి బాబు తన పాదయాత్రలో హామీల వర్షం కురిపిస్తున్నాడు. తాము అధికారంలోకి వచ్చాక చేసే మొదటి సంతకం రైతులకు రుణ మాఫీ అని బాబు వెళ్ళిన చోటల్లా అంటున్నాడు. ఇక మన సిఏం మాత్రం తక్కువ తిన్నాడా, వచ్చే ఏడూ రైతులకు ఇచ్చే రుణాలు డెబ్భయ్ వేల కోట్లు దాటుతుందని, అంత మొత్తాన్ని ఎలా మాఫీ చేస్తావో చెప్పు అని బాబు కు సవాల్ విసిరాడు, తన ఇందిరమ్మ బాటలో భాగంగా. ఇంకా బాబు దీనికి సమాధానం చెప్పలేదు కాని ముఖ్య మంత్రి దూకుడు చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. అధిష్టానం 2014 వరకు మీరే సిఏం అన్నారో, మరి ఇందిరమ్మబాట నుండి ఇక మీకు ఇంటి బాట అన్నారో తెలియదు కాని, కిరణ్ మాత్రం తీవ్రంగా రెచ్చిపోయాడు. చూడాలి బాబు దీనికి సమాధానం చెబుతాడో, వెటకారం చేస్తాడో అని. 

మరింత సమాచారం తెలుసుకోండి: