తెలుగుదేశం పార్టీలో ఎన్నికల ముందు వరకూ ఎన్టీఆర్ నామస్మరణ జరిగింది. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న టీడీపీ "రామన్న రాజ్యం'' నినాదాన్ని ఎత్తుకొంది. వైకాపా వాళ్లు "రాజన్న రాజ్యం'' అని అంటే... తెలుగుదేశం వాళ్లు "రామన్న రాజ్యం'' అంటూ నినదించారు. వివిధ పథకాలను ప్రకటించి.. అధికారంలోకి వస్తే వాటిని అమలు చేసి.. ఎన్టీఆర్ పేరు మార్మోగేలా చేస్తామనే అభిప్రాయాన్ని కలిగించారు టీడీపీ నేతలు. అయితే తీరా అధికారాన్ని సాధించుకొన్నాకా మాత్రం పరిస్థితి మారిపోతోంది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలో ఉన్న ఎన్టీఆర్ పేరు ఎక్కడా వినిపించడంలేదు. ప్రభుత్వ పథకాల విషయంలో అయితే.. చంద్రన్న పేరు వచ్చేసింది. వరసగా అన్ని పథకాలకూ "చంద్రన్న'' పేరే అలంకారం అవుతోంది. ఇప్పటికే రెండు పథకాలకు చంద్రన్న పేరు ఖాయమైంది. చంద్రన్న సంక్రాంతి కాను అని ఒకటి.. వ్యవసాయధారు ల కార్యక్రమం మరోటి. ఈ విధంగా తెలుగుదేశం హయాంలో చంద్రన్న పేరు వినిపిస్తోంది. భవిష్యత్తులో అనేక పథకాలకు ఇదే పేరే పెట్టబోతున్నారని కూడా సమాచారం. ఓవరాల్ గా ఇకపై తెలుగుదేశం ప్రభుత్వ పథకాలకు ఎక్కడా ఎన్టీఆర్ పేరు వినిపించదనమాట. అన్నగారు ఇక పోయినట్టేనని..అంతటా చంద్రన్నగారే కనిపిస్తారని తెలుస్తోంది. మరి తన పాలనలో తన పేరే పెట్టుకొంటున్న ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నిలబడుతున్నాడు. ఇంతకు ముందు ఇలాంటి పోకడలకు పోయిన వారు ఎవరూ లేరు. కిరణ్ కుమార్ రెడ్డి మాత్రమే "రాజీవ్ యువ కిరణాలు'' అంటూ తన పేరును కొంత ప్రమోట్ చేసుకొనే యత్నం చేశాడు. ఇప్పుడు బాబు ఫుల్ గా తన పేరునే ప్రమోట్ చేసుకొంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: