సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి అధిష్టానం నుంచి హఠాత్తుగా పిలుపు రావడంతో హాట్ హాట్ రాజకీయాలకు తెరలెస్తోంది. సీఎం ఢిల్లీ పర్యటన వెనుక అనేక ఊహగానాలు చెలరేగుతున్నాయి. ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని రాష్ట్రపార్టి నేతల్లో ప్రచారం సాగుతుంది. ఒక ప్రక్క సీఎం ఇందిరమ్మబాట తో జిల్లాల్లో బిజి బిజిగా గడుపుతున్నప్పటికి మార్పు అనివార్యం అనే గుస గుసలు వినిపిస్తున్నాయి.కోందరి నేతల పేర్లు కూడా సీఎంగా తెరపైకి తెస్తున్నారు.ఇప్పటికే రాష్ట్రపార్టి ఎంపిలు సీఎం పై గుర్రుగా ఉన్నారు. కొందరు మంత్రులు కూడా ఇటీవల ఢిల్లీపర్యటనలో సీఎం పై ఫిర్యాదులు చేసినట్టు సమాచారం. ఒకప్రక్క సీఎం కు అదిష్టానం పూర్తి అధికారాలు అప్పగించిందని 2014 వరకూ కిరణ్ ముఖ్యమంత్రిని సీఎం సన్నిహితులు ఒక ప్రక్క చెపుతున్నారు.రానున్న రాజుల్లో కాంగ్రెస్ పార్టిని కిరణే అధికారంలోకి తీసుకు వస్తాడని ప్రచారం చేస్తున్నారు. నామినేటెడ్ పదవుల విషయంలో భారి స్దాయిలో పందారం ఉంటుదనుకున్నప్పటికి అధికారభాషా సంఘం మండలితోనే ఆగిపోయింది. నామినేటెడ్ పధవుల విషయంలోనూ సీఎం పై కొందరు నేతలు ఫిర్యాదులు చేసినట్టు సమాచారం. సీఎం అనుకూల ప్రతికూల వర్గాల నేతలు ఎవరికి వారు భరోసాగానే ఉన్నారు. మార్పు అనివార్యం అని వ్యతిరేక వర్గం చెపుతుండగా మార్పు ఉండదని మరిన్ని అధికారాలు ఇచ్చేందుకే సీఎం ఢిల్లీకి వెళుతున్నారని అనుకూల నేతల వాధనగా ఉంది.ఎం జరుగుతుందో వేచి చూడాలి మరి... 

మరింత సమాచారం తెలుసుకోండి: