అల్లకల్లోలం చేసిన శాండీ హరికేన్‌ పరిస్థితులు ఇప్పుడిప్పుడే సాధరణ స్థితికి చేరుకోవడంతో మళ్లీ అమెరికా అధ్యక్ష ఎన్నికల వేడి ఊపందుకుంటోంది. అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, ప్రత్యర్థి మిట్‌ రోమ్ని ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు. తాఆజగా విడుదలపై పోల్‌ సర్వే ఫలితాల ప్రకారం ఇరువురి మధ్య పోరు హోరా హోరీగా సాగుతుతున్నట్టు వెల్లడైంది. రోమ్నీతో పోల్చుకుంటే ఒబామా స్వల్ప ఆధిక్యంలోనే ఉన్నట్టు ఆయా సర్వేలు చెబుతున్నాయి. ఒబామాకు ఎంతో కీలకమైన రాష్ట్రం కొలరాడోతో పాటు మరో రెండు రాష్ట్రాల్లో ప్రచారాన్ని ముగించారు. ఇక్కడ సీఎన్‌ఎన్‌, ఓఆర్‌సీ ఇంటర్నేషనల్ పోల్‌ సర్వే ప్రకారం 50శాతం ఓటర్లు ఒబామాకు మద్దతు పలుకుతుండగా, రోమ్నీకి 48శాతం అండగా నిలుస్తున్నట్టు స్పష్టమైంది. మరోవైపు అమెరికాకు చెందిన ఒక రాజకీయ పరిశోధన సంస్థ వారాంతంలో జరిపిన ఓ సర్వేలో రోమ్నీకే మొగ్గు కనిపించింది. రోమ్నీకి 48శాతం, ఒబామాకు 47శాతం ప్రజలు మద్దతునిస్తున్నారని వెల్లడించింది. ఇక వాషింగ్టన్‌ పోస్ట్‌-ఏబీసీ న్యూస్‌ సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా ప్రజలంతా ఒబామా వెంటే నడుస్తు న్నారని స్పష్టం చేసింది. ఒబామాకు 49శాతం, రోమ్నీకి 48శాతం ఓట్లు పడనున్నాయని తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: