వ్యవసాయ రంగంపై ప్రభుత్వ తీరును ప్రతిపక్షాలు ఎండగట్టాయి. రైతులపై నర్లక్ష్యధోరణిని తీవ్రంగా నికసంచాయి. వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం అప్పుల ఊబిలోకి దింపిన ప్రభుత్వవైఖరిని నిరసిస్తూ టిడిపి సోమవారం నాడిక్కడ ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన మహాధర్నాకు భారీ ఎత్తున టిడిపి, సిపిఐ కార్యకర్తలు, రైతులు హాజరయ్యారు. ధర్నాకు హాజరైన టిడిపిఅధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు మాట్లాడూతూ ప్రభుత్వ తీరుపై తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. చేతకాని, దగకోరు, రైతు వ్యతిరేక ప్రభుత్వమని పేర్కొన్నారు. రైతాంగానికి మాటలు చెబుతున్నారే తప్ప, ఆచరణలో చేస్తున్నది శున్యమని మండిపడ్డారు. ఎరువులు, విత్తనాలు లభించక రైతుఅగచాట్లు పగడుతుంటే ప్రభుత్వం దద్దమ్మలా చూస్తున్నదని నిరసన వ్యక్తం చేశారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల విత్తనాలు అవసరం కాగా 30శాతం కూడా సరఫరా చేయలేదన్నారు. ప్రభుత్వం చెబుతున్న పావల వడ్డీ ఎక్కడా అమలు కావడం లేదన్నారు. రుణ వడ్డీ మాఫీ అని మాయమాటలు చెబుతున్నదన్నారు. విత్తనాలు, ఎరువుల కొరకు రైతులు రోజుల తరబడి క్యూలైన్లో నిలబడవలిసిన దుస్ధితిని కల్పించారని నిరసన వ్యక్తం చేశారు. విత్తనాలు అందించడానికి లాటరీ పద్దతిని ఎంచుకుందని ఆయన ప్రభుత్వన్ని ఎద్దేవా చేశారు. కరెంటును సక్రమంగా అందించాలేదన్నారు. రుణాల రీషెడ్యల్ కాలేదన్నారు. కేంద్రం 25 సార్లు పెట్రోలియం ఉత్పత్తుల ధరలను పెంచిందన్నారు. ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల ధరలను అడ్డగోలుగా పెంచిందన్నారు. వర్షకాలంలో కూడా కరెంట్ కోతను విధిస్తున్నారని ఇదెక్కడి ప్రభుత్వమని ఆయన విమర్శించారు.రెండేళ్ళలోనే విద్యుత్ పై పదివేల కోట్లు భారం వేసారని నిరసన వ్యక్తం చేశారు. ఆదర్శ రైతుల పేరిట 10వేల మంది కాంగ్రెస్ కార్యకర్తలకు అనవసరంగా జీతాలిస్తున్నారని విమర్శించారు. స్వామినాథన్ సిఫారసులను ఎందుకు అమలు చేయరని ఆయన ప్రశ్నించారు. ఎన్ని ఆందోళనలు చేసినా ప్రభుత్వాకి రైతాంగంపై కనికరం కలగడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేసినా ప్రభుత్వనికి కనువిప్పు కలగలేదని, రైతుకు చేయూతనిచ్చేందుకు ప్రయత్నించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతాంగ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి అందరూ సమాయత్తం కావాలన్నారు. వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ అంశాన్ని తమ ఎన్నికల ప్రణాళికలు చేర్చనున్నట్లు ఆయన ప్రకటించారు. వ్యవసాయ రంగాన్ని 50 శాతం లాభసాటిగా మారుస్తామని ఆయన పేర్కొన్నారు. వ్యన్ పిక్ ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతాంగా పోరాటాన్ని ఇంకా ఉదృతం చేస్తామని చెప్పారు. ఇది అంతం కాదని ఆరంభం మాత్రమేనని గ్రహించవలసిందిగా ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతాంగ సమస్యల పరిష్కారానికి జిల్లా, మండల స్థాయిలో ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధం కావాలని సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ పిలుపునిచ్చారు. ఇది నిజమైన ప్రభుత్వం కాదని విమర్మించారు. అబద్దాలను బొంకుతూ కాలం గడిపేస్తున్న ప్రభుత్వమని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వ్యాపారులు లాలూచీ పడ్డారని అందుకే ఎరువులు బ్లాక్ మార్కట్ అవుతున్నాయన్నారు. ప్రభుత్వం, ఎరువుల వ్యాపారుల మధ్య లాలూచీ కుస్తీ నడుస్తున్నదని విమర్శించారు. ఎరువుల వ్యాపారుల లైసెన్సులను రద్దుచేసి వారితో లాలూచీ లేదని ప్రభుత్వం నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానాన్ని వ్యాపారులు శాసిస్తున్నారన్నారు. ఇదొక లంచగొండి ప్రభుత్వమని విమర్మించారు. ముఖ్యమంత్రి కుర్చీ ఊగుతున్నదని, కుర్చీ నట్లు సోనియా గాంధీ వద్ద ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఢిల్లీ ఆడిస్తున్న కీలుబొమ్మ ప్రభుత్వమని విమర్శంచారు. ప్రజలు, రైతులు తిరగబడితే ఈ ప్రభుత్వాన్ని ఎవరూ కాపాడలేరని ఆయన హెచ్చరించారు. కార్పోరేట్ వ్యవసాయానికి అనుమతిస్తున్న ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లేలా చూడవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షులు కె.రామకృష్ణ రైతులకు పిలుపునిచ్చారు. రైతాంగం మొత్తం ప్రభుత్వంపై పొరుకు సమాయత్తం కావలసిందిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య, అధ్యక్షురాలు పశ్యపద్మ, సిపిఐ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్మి వి.ఎస్.బోస్, రంగారెడ్డి జిల్లా కార్యదర్మ బాలమల్లేష్ లు పిలుపునిచ్చారు. షార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మురళీధర్ దేశ్ పాండే, ఆర్ఎస్ పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జానకి రాములు ప్రభుత్వ తీరును నిరసించారు. టిడిపి నాయకులు వర్ల రామయ్య కార్యక్రమ సందాన కర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గాలి ముద్దుక్రిష్ణమనాయుడు, మోత్కుపల్లి నర్సింహులు, పి.మహేందర్ రెడ్డి, ఉమామాదవ రెడ్డి, కె.ఎస్. రత్నం, దయాకర్ రెడ్డి, నన్నపనేని రాజకుమారి,జైపాల్ యాదవ్, రాములు,పెద్ది రెడ్డి తదితరులున్నారు. ధర్నా అనంతరం నయకులు ఛలో సెక్రెటేరియట్కు ప్రయత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. చంద్రబాబు నాయుడు, కె. నారాయణ, సిపిఐ నాయకులు కె.రామక్రిష్ణ, రావుల వెంకయ్య, సిపిఐ మహబూబ్ నగర్ జిల్లా కార్యదర్శి ఈర్ల నర్సింహ, రంగారెడ్డి జిల్లా నాయకులు పుస్తకాల నర్సింగ్ రావు, ఆర్.కృష్ణయ్య, నిర్మలా దేవి, లక్ష్మి, కమలమ్మలను పోలీసులు అరెస్టు చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కొద్దిసేపటి అనంతరం వీరందరిని విడుదల చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: