అతి పెద్ద ఈ కామర్స్ మార్కెట్‌గా ఈ ఏడాది ఆసియా అవతరిస్తుందని ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఈఐయూ) సర్వేలో వెల్లడైంది. ఇప్పటివరకూ అగ్రస్థానంలో ఉన్న ఉత్తర అమెరికాను తోసిరాజని ఆసియా ప్రాంతం మొదటి స్థానంలోకి దూసుకువస్తుందని ఈఐయూ సర్వే పేర్కొంది. ఎకనామిస్ట్ మ్యాగజైన్ గ్రూప్ అడ్వైజరీ కంపెనీగా వ్యవహరిస్తున్న ఈఐయూ ఈ సర్వేను నిర్వహించింది. చైనా, హాంగ్‌కాంగ్, తైవాన్, మకావూ, భారత్, జపాన్, సింగపూర్, కొరియా తదితర దేశాల్లో మొత్తం 5,500 మంది మహిళలపై ఈఐయూ ఈ సర్వేను నిర్వహించింది. వివరాలు...

ఈ కామర్స్ మార్కెట్‌, ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్, ఎకనామిస్ట్ మ్యాగజైన్ గ్రూప్ అడ్వైజరీ కంపెనీ, రిటైల్ అమ్మకాలు,ఈ కామర్స్‌లో రిటైల్ అమ్మకాలు ఈ ఏడాది ఆసియాలో 5 శాతం వృద్ధితో 7.6 లక్షల కోట్ల డాలర్లకు పెరుగుతాయి. ఇది ఉత్తర అమెరికాలో 2.5 శాతం, యూరప్‌లో 0.8 శాతం చొప్పున వృద్ధి ఉండొచ్చు. ఆసియా మహిళలకు స్వేచ్ఛ, ఆర్థిక శక్తి పెరగడం, ఆన్‌లైన్ షాపింగ్‌పై మక్కువ పెరుగుతుండడం వంటి కారణాల వల్ల అసియాలో ఈ కామర్స్ హవా పెరుగుతోంది.

షాప్‌కు వెళ్లడం కంటే ఆన్‌లైన్‌లోనే షాపింగ్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తామని సగానికి పైగా మహిళలు చెప్పారు.- వస్తువులు, సేవలకోసం రోజులో ఒక్కసారైనా నెట్‌ను వాడతామని 63% మంది చెప్పారు.

.

మరింత సమాచారం తెలుసుకోండి: