ఎవరు ఔనన్నా.. ఎవరు కాదన్నా.. తెలుగుదేశం పార్టీలో కమ్మ కులస్తులకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీని ఓన్ చేసుకొన్నది ఆ క్యాస్టే కాబట్టి.. వారికి ఆ పార్టీలో ప్రాధాన్యత అధికంగా దక్కుతుంది. ఆవిర్భావం నుంచినే కమ్మ వాళ్లను అమితంగా ఆకట్టుకొని.. వారితో గొప్ప బంధాన్ని పెనవేసుకొన్న తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఆ కులస్తుల్లో కొంతమంది ఒక వెలుగు వెలుగుతుంటారు.

కాంగ్రెస్ కూడా ఇంతకు ముందు చాలా మంది కమ్మవాళ్లే ఉండే వారు. వైకాపా కూడా ఇప్పుడు కమ్మవాళ్లుకొంతమంది ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం కమ్మవాళ్లకు స్వర్గధామమే. అందుకు తగ్గట్టుగా పదేళ్ల తర్వాత అధికారం చేతికందిన నేపథ్యంలో చంద్రబాబు తొలి విడతగా ఐదు మంది స్వకులస్తులకు మంత్రి పదవులను ఇచ్చాడు.

మొత్తం 19 మంది మంత్రుల్లో ఐదు మంది కమ్మ మంత్రులున్నారు. ఇ ప్పుడు వారి సంఖ్య మరింత పెరగనున్నట్టుగా తెలుస్తోంది. మరో ఇద్దరు కమ్మ వాళ్లను బాబు మంత్రివర్గంలోకి తీసుకోనున్నారట. వారిలో ఒకరు పయ్యావుల కేశవ్ కాగా మరొకరు గాలిముద్దుకృష్ణమనాయుడు.

వీరిద్దరూ మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.. ఎమ్మెల్సీ పదవిపై బోలెడాశలతో ఉన్నారు. వారికి ఎమ్మెల్సీ పదవులను ఇవ్వడంతో పాటు బాబు మంత్రి పదవులు కూడా ఇవ్వనున్నాడట. మరి ఇదే జరిగితే క్యాబినెట్ లోని కమ్మ వాళ్ల సంఖ్య ఏడు కు పెరుగుతుంది. దీంతో కమ్మదనం పెరుగుతుందనే అనుకోవాలేమో!

మరింత సమాచారం తెలుసుకోండి: