గతం గతహ..ఫ్యూచర్ ఆలోచిద్దాం. సైలెంట్ గా ఉన్న క్యాడర్ లో జోష్ నింపుదాం. అన్నీ వర్గాలను ఏకం చేసి…పూర్వవైభవాన్ని తీసుకోద్దాం. ఇందుకోసం నయా స్కెచ్ వేస్తోంది కాంగ్రెస్ పార్టీ. పార్టీలో యువ రక్తాన్ని నింపేందుకు సీనియర్లకు ఏజ్ లిమిట్ పెడుతోంది. సీనియర్లను ప్రత్యక్ష రాజకీయాల నుంచి పక్కకు పెట్టాలని డిసైడయ్యింది

సీనియర్ల ప్రభావం ఎక్కువగా ఉండటం…జూనియర్లకు అవకాశం రాకపోవడం…పార్టీని నష్టపోవడానికి కారణంగా భావిస్తోంది అధిష్టానం. దీంతో ఏజ్ లిమిట్ ప్రతిపాదనల ఫైల్ సోనియా దగ్గరకు చేరింది. ఒక్క సైన్ తో 65 ఏళ్లు దాటిన ముదుర్లను..నామినేటెడ్ పోస్టులకు పరిమితం చేయనుంది. అయితే సీనియర్లు కూడా కేంద్ర నిర్ణయానికి సరేనంటున్నారు. పార్టీ కోసం ప్రత్యేక్షరాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్దంగా ఉన్నామంటున్నారు.

సీనియర్ సిటీజన్ ఫైల్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే…స్టేట్ కాంగ్రెస్ లో భారీగా మార్పులు జరుగుతాయి. ఏళ్లగా పార్టీని ముందుకు నడిపిస్తున్న…పొన్నాల, జానారెడ్డి, డీఎస్ లాంటీ సీనియర్లు..ప్రత్యక్ష పోరుకు దూరంగా కావాల్సిందే. ఇప్పటికే వారసులకు టికెట్లు ఇప్పించుకునేందుకు రెడీ అయిన సీనియర్లు…ఈ ఆఫర్ ను స్వాగతించే ఛాన్స్ ఉందంటున్నారు పార్టీ నేతలు.

ఫస్ట్ జనరేషన్ పూర్తిగా పోయి..సెకండ్ జనరేషన్ ఎంట్రీ ఇస్తే ..పార్టీకి పూర్వవైభవం వస్తుందంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: