యూఎస్ కాంగ్రెస్ తొలి హిందూ మెంబర్ తులసీ గబార్డ్ (33) త్వరలో పెళ్లి కూతురు కాబోతున్నారు. తనకన్నా ఏడేళ్ళు చిన్నవాడైన సినిమాటోగ్రాఫర్ అబ్రహం విలియమ్స్ (26)ను ఆమె ప్రేమ వివాహం చేసుకోనున్నారు.

ఈ ఏడాది ఏప్రిల్‌ లో హిందూ సంప్రదాయ ప్రకారం వీరి వివాహం జరుగనుందని తులసీ గబార్డ్ స్వయంగా ప్రకటించారు. తమకు నిశ్చితార్థం జరిగి నెల రోజులు దాటిందని ఆమె చెప్పారు. ఆ సమయంలో విలియమ్స్ తన చేతి వేలికి డైమండ్ రింగ్ తొడిగారని మురిపెంగా తెలిపారు.

ఆయన సుగుణాలను వివరిస్తూ, బోళాతనం, మంచితనం మూర్తీభవించిన వ్యక్తి అని పొగిడారు. కాగా, ప్రస్తుతం విలియమ్స్ ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్‌‌గా పనిచేస్తూ, షార్ట్ ఫిల్మ్స్ ‌తోపాటు రాజకీయ, వాణిజ్య ప్రకటనల చిత్రీకరణ సేవలందిస్తున్నారు.

.

మరింత సమాచారం తెలుసుకోండి: