దెయ్యం అంటే ఎవరికి భయం ఉండదు. ఒక్క పుకారు దెయ్యం గురించి వస్తే చాల ఎంత ధైర్యవంతుడైనా కాస్త వెనుకా ముందు ఆడుతారు. ఇదే భయం కర్ణాటకలోని మైసూర్ కోర్టులో ఉన్న ఒక హాలులో దెయ్యం తిరుగుతోందనే పుకార్లు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. దీంతో దెయ్యం దెబ్బకు భయపడి కోర్టులో ఒక హాలును కొన్ని నెలలుగా మూసివేసి ఉన్నారు. ఈ ఘటన తొమ్మిది నెలల క్రితం జరుగగా కాస్త ధైర్యం తెచ్చుకొని హాలు తీయాలనే ప్రయత్నం కూడా భయంతో విఫలం అయ్యింది.

మూసివేసిన కోర్టు హాలు తలుపులను తీయవద్దని కొందరు న్యాయవాదులు కోరుతుంటే, అబ్బే దెయ్యం లేదు ఏం లేదే అని మరి కొందరు న్యాయవాదులు వారిని విబేదిస్తున్నారు. ఎన్నో ముఖ్యమైన కేసుల వాదనలకు ప్రముఖ న్యాయమూర్తులు, న్యాయవాదులకు నెలవుగా నిలిచిన ఈ కోర్టు హాలును మూఢనమ్మకాల కారణంగా మూసివేయడం న్యాయంకాదని, ఆ హాలును తెరవాలని డిమాండ్ చేస్తున్నారు.

లాయర్లు రెండు గ్రూపులుగా విడిపోయి ఈ విషయంలో పరస్పర ఘర్షణలకు దిగుతున్నారు. దీంతో ఆ కోర్టు హాలును తెరిచే సాహసం ఎవరూ చేయడం లేదు. కాగా, గతంలో ఇదే కోర్టులో జడ్జిగా పనిచేసిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోయి దెయ్యమై అందులో సంచరిస్తున్నాడన్న పుకార్లతో కోర్టు హాలును మే 2014లో మూసివేశారు.

ప్రస్తుతం ఇందులో విరిగిపోయిన బల్లలు, కుర్చీలు వేసి స్టోర్ రూమ్ గా వాడుతున్నారు. ఒకవేళ దీన్ని తప్పనిసరిగా తెరవాలని భావిస్తే, శాంతి పూజలు చేయాల్సిందే ఖరాకండిగా చెబుతున్నారు బూత వైద్యులు..

మరింత సమాచారం తెలుసుకోండి: