నిజమేనా అంటే అవును అని మన రాష్ట్రం వారు ఒప్పుకుని తీరాలి. చీటికి మాటికి ఢిల్లీకి వెళ్ళే మన ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు కాస్తయినా ఈ ఖర్చుల వల్ల మన ఖజానా ఫై ఎంత భారం పడుతుందో ఒక్కసారి అలోచించినా మన ఆర్ధిక పరిస్థితి ఎంతో మెరుగు పడుతుంది. అస్సలే కాంగ్రెస్ వారి సిఎం అందునా నామినేటెడ్ సిఎం అయితే ఎన్ని కష్టాలు, ఎప్పుడు తీసేస్తారేమోనన్న దిగులు ఉండనే ఉంటుంది . ఇది రాజకీయంగా సంక్లిష్ట పరిస్థితి, కానీ ప్రతి చిన్న విషయానికి కుడా ఢిల్లీ వెళ్ళందే కిరణ్ కుమార్ రెడ్డి గారికి తోచదేమో . ఏదేమైనా ఈ వైఖరి వల్ల వారు నష్టపోయేదేమో కానీ పన్ను కడుతున్న ప్రజలకు మాత్రం వీరి విమాన ఖర్చులు,వసతి వంటి ఖర్చుల పట్టి గురించి అలోచిస్తే మాత్రం ఇన్ని కోట్లతో ఒక సంక్షేమ పతాకాన్ని విజయవంతంగా కొనసాగిన్చవచ్చని అనుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: