రాజధాని భూసమీకరణ అంశం ఇప్పుడు ఆంధ్రాలో హాట్ టాపిక్ అయ్యింది. బ్రహ్మాండమైన రాజధాని కోసం తొలివిడతలో 33వేల ఎకరాలు సేకరించాలని చంద్రబాబు సర్కారు చెబుతోంది. దాదాపు ఆ లక్ష్యం కూడా పూర్తి చేసింది. ఆలస్యంగా మేలుకున్న జగన్, పవన్ ఇప్పుడు పరామర్శ యాత్రల పేరుతో హడావిడి చేస్తున్నారు.

రాజధాని భూసమీకరణ తొలి నుంచీ వివాదాస్పదంగానే సాగుతోంది. అసలు రాజధానికి అన్నివేల ఎకరాల అవసరమా అంటూ చాలా మంది విమర్శలు గుప్పించారు. వైఎస్సార్సీపీ, వామపక్షాలతో పాటు అనేక పార్టీలు.. అంత భారీ స్థాయిలో భూసమీకరణ వద్దని సూచించారు. వడ్డే శోభనాద్రీశ్వరరావు వంటి సీనియర్లు కూడా అన్నివేల ఎకరాలు సేకరించొద్దన్నారు.

ఐతే.. విచిత్రమైన విషయం ఏమిటంటే.. రాజధాని వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం 33 వేల ఎకరాలు సేకరిస్తుంటే... ఇంత రచ్చవుతోంది. కానీ.. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వేల ఎకరాలు భూసేకరణ చేసినా పెద్దగా వివాదాస్పదం కాలేదు. అందులోనూ వైఎస్ భూసేకరణ చేసింది ప్రైవేటు కంపెనీల కోసం. అది కూడా 25వేలు, 40 వేలు ఎకరాలు వైఎస్ ధారాదత్తం చేశారు.

ఏపీ కోస్తాలో 40 శాతం ఒకే కంపెనీ చేతుల్లో ఉందని ఇటీవల ఓ రాజకీయ నాయకుడు చేసిన ఆరోపణే ఇందుకు ఉదాహరణ. మరి అప్పట్లో ఈ భూకేటాయింపులపై, భూసేకరణపై ఎందుకు అంత వ్యతిరేకత రాలేదు. ఈ భూములు.. రాజధాని భూముల్లా ఖరీదైనవి, 2, 3 పంటలు పండేవికానందుకేనా.. ? లేక అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ ఈ ఇష్యూని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయిందా.. లేక.. నయానో భయానో వై.ఎస్. అందరినోళ్లూ మూయించారా..? ఆలోచించాల్సిన విషయమే..!

మరింత సమాచారం తెలుసుకోండి: