తెలంగాణ రాష్ట్ర సమితి వారికి మిత్రపక్షం అంటూ ఏదీ లేదు. కాంగ్రెస్ , తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఇలా ప్రతి పార్టీ కూడా తెరాస మీద గుర్రుగానే ఉంది. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి వైపు నుంచి మాత్రం ఇప్పుడు ఒక పార్టీ మీద ఎక్కువ ప్రేమ వ్యక్తం అవుతోంది. ఆ పార్టీ ని ఆకట్టుకోవడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. తెరాస అలా చేతులు కలపే అవకాశం గురించి ఎదురుచూస్తున్నది బీజేపీ గురించి

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో జత కట్టడానికి తెరాస తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టుగా కొంతకాలం నుంచి వార్తలు వస్తున్నాయి. తెరాస ఎన్డీయేలో భాగస్వామి కావడం.. కవితకు మంత్రి పదవి దక్కడం ఖాయమైందని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో తెరాస నేతల తీరు కూడా కొన్ని అనుమానాలుకు తావిస్తోంది. ప్రత్యేకించి తెరాస ఫస్ట్ ఫ్యామిలీ వ్యవహరిస్తున్న తీరే ఇక్కడ ఆ అనుమానాలు కలిగిస్తోంది.

కేసీఆర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ మధ్య భారతీయ జనతా పార్టీ గురించి సానుకూలంగా మాట్లాడటం.. ఆ పార్టీ తో సన్నిహితంగా కనపడటం చేస్తోంది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ విషయంలో కూడా కవిత సానుకూలంగా స్పందించింది. ఆ విషయంలో ప్రధానమంత్రి, రైల్వే మంత్రులకు ఆమె ధన్యవాదాలు తెలిపింది.

బీజేపీ వారు కాకుండా.. ఇలా రైల్వే బడ్జెట్ గురించి పాజిటివ్ గా మాట్లాడిన వేరే పార్టీ నేత కవిత మాత్రమే. ఇలాంటి నేపథ్యంలో తాజాగా కవిత మహిళా దినోత్సవాన్ని కూడా భారతీయజనతా పార్టీ నేతలతో కలిసి సెలబ్రేట్ చేసుకొంది. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో కలిసి ఆమె సంబరాలు చేసుకొంది. మరి తెరాస ఆఫీసులో సంబరాలు జరిగినా.. అక్కడకు వెళ్లని కవిత దత్తన్న దగ్గర కనిపించే సరికి మాత్రం.. ఇది బీజేపీకి దగ్గరగా మరో అడుగువేయడమే అనుకోవాల్సి వస్తోంది. మరి దీనిపై బీజేపీ వాళ్లు ఏమనుకొంటున్నారో.. టీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో!

మరింత సమాచారం తెలుసుకోండి: