మళ్లీ విజ్రుమ్భించి ఉద్యమాన్ని పతక స్థాయిలోకి తీసుకువెళతామని తెరాస అధినేత కెసిఆర్ కరీంనగర్లో జరుగుతున్న మేదోమధనంలో ప్రతిజ్ఞ చేసారు. తనతో కాంగ్రెస్ కు చెoదిన ఎం.పీ లు ఎం.ఎల్.ఏ లు టచ్ లో వున్నారని సరైన సమయంలో వారు తెరాసలోకి వస్తారని కూడా అంటున్నాడు. వచ్చే ఎన్నికల్లో 100 అసెంబ్లీ , 15 లోక సభ సీట్ల కోసం బాగా ప్లాన్ చేద్దామని , మనకు కచ్చితంగా వచ్చి తీరుతాయని, 2014 ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు , సీట్ల సర్దుబాటు ఉండవని పార్టీ శ్రేణులకు చెప్పాడు. ప్లాన్ బాగుంది కానీ తెరాసకు నిజంగా అంత సీన్ ఉందా అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. క్రితం సారి కాంగ్రెస్, మహాకుటమి, ప్రజారాజ్యంల మధ్య త్రిముఖ పోటీ జరిగి ఆఖరకు వైఎస్ చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీ మాత్రం బాగా లాభపడింది. ఈసారి మహాకూటమి లేదు, ప్రజారాజ్యం లేదు, మరి కాంగ్రెస్, తెదేపా, బిజేపి , తెరాస, వైఎస్ఆర్ కాంగ్రెస్ ల మధ్య పంచముఖ పోటీ ఉంటుందా, మరి ఇందులో ఎవ్వరు లాభపడతారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: