ఉత్తరప్రదేశ్ రాజకీయాలతో విసిగిపోయిన జయప్రద మళ్లీ రాష్ర్టం వైపే చూస్తున్నట్టుంది. తాజాగా తన భవిష్యత్త్ రాజకీయ జీవం ఆంద్రప్రదేశ్ ప్రజలకి అంకితం అమె అన్నారు. ఓ ప్రవేట్ కార్యక్రమానికి హైదరాబాద్ వచ్చిన జయప్రద...కొత్త పార్టీలో చేరే దానిపై మాట దాట వేసారు. రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తారా అని ప్రశ్నించగా.. తాను ఇప్పుడు యూపిలో ఉన్నానని, ఎపి ప్రజలకు తాను రుణపడి ఉంటానని, తన మనసు తెలుగు ప్రజలకే అంకితమని చెబుతూనే.. ఇక్కడకు వచ్చే విషయాన్ని సూటిగా చెప్పలేకపోతోంది. జయప్రద 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోనే పోటీ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం. అయితే జయప్రద ఏ పార్టీలో చేరుతారనే ప్రశ్న ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఏ పార్టీలో చేరాలనే దానిపై జయప్రద తన సన్నిహితులు, రాజకీయ మిత్రులతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల జయప్రద పలు సందర్భాలలో చేసిన వ్యాఖ్యలను గమనిస్తే టీడీపీలోకి వెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అంతేకాకుండా ఆమె గతంలో టిడిపితోనే రాజకీయ ఆరంగేట్రం చేసింది. చంద్రబాబుతో చిన్న చిన్న విభేదాల కారణంగా ఆమె ఆ పార్టీని విడిచిపెట్టింది. ఎనిమిది నెలల క్రితం తిరుపతి వచ్చినప్పుడు ఆమె మాట్లాడుతూ... బాబు పాలనపై ప్రశంసలు కురిపించడంతో పాటు, టిడిపికి దూరంగా ఉన్నంత మాత్రాన ఆయనను వ్యతిరేకించినట్లు కాదని చెప్పారు. తనకు బాలకృష్ణతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: