తెలంగాణ రాష్ట్ర సమితి తమ చేతిలో అధికారాన్ని పెట్టుకొని కూడా నవ్వుల పాలు అవుతోంది. అంతా అనుకూలంగా ఉందని భావిస్తూ కూడా అభాసుపాలవుతోంది. బలంగా ఉన్నామని.. తమ పని తీరును మెచ్చి ఇతర పార్టీ ల వారు కూడా వచ్చి చేరుతున్నారని చెప్పుకొంటూ కూడా తెలంగాణరాష్ట్ర సమితి వారు ప్రతిపక్షాలకు సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు

మంత్రిగా తలసాని శ్రీనివాసయాదవ్ ను ఒప్పుకోలేమని కాంగ్రెస్ పార్టీ వాళ్లు అంటున్నారు. తాము అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే అర్హత కూడా ఆయనకు లేదని అంటూ వారు తెలంగాణ శాసనమండలి నుంచి వాకౌట్ చేయడం జరిగింది. మరి సమాధానంతో సంతృప్తి పడటం సంగతెలా ఉన్నా.. మంత్రిగా ఉన్న వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అని ఆయనకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదని కాంగ్రెస్ వారు ధ్వజమెత్తారు.

మరి తెలుగుదేశం వాళ్లే అనుకొంటే.. కాంగ్రెస్ వాళ్లు కూడా ఇలాంటి విమర్శలే చేస్తున్నారు. మరి ఇది తెలంగాణ రాష్ట్ర సమితికి నైతికంగా సమస్యే! ప్రతిపక్ష పార్టీ ల వాళ్లను చేర్చుకొన్నామని గొప్పగా చెప్పుకొంటున్న వాళ్లు ఈ అంశం గురించి సమాధానం చెప్పుకోవాల్సి వస్తోంది.

మరి ఈ పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవడం అంటే.. తమ వైపు వచ్చిన ఇతర పార్టీ ఎమ్మెల్యేల చేతరాజీనామా చేయించి ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే తెలంగాణ రాష్ట్ర సమితికి మాత్రం అంత ధైర్యం ఉన్నట్టుగా లేదు. అందుకే ఇలా బండి లాగిస్తోంది. దీంతో ప్రత్యర్థి పార్టీ లనుంచి విమర్శలు తప్పడం లేదు!

మరింత సమాచారం తెలుసుకోండి: