ఎవరేం అన్నా.. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం వెనక్కు తగ్గడం లేదు. తను ఏం చేయాలనుకొన్నదో దానికి కట్టుబడి ముందుకుపోతోంది. వాస్తు నియమాలకు కట్టుబడే వ్యవహరిస్తోంది. సచివాలయాన్ని ఎర్రగడ్డకు తరలించాల్సిందేనని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ బడ్జెట్ లో కొత్త సచివాలయం నిర్మాణానికి ఏకంగా 150 కోట్ల రూపాయలు కేటాయించేడం జరిగింది.

దీన్ని బట్టి ఈ విషయంలో కేసీఆర్ పునరాలోచించడం లేదని స్పష్టం అవుతోంది. ప్రస్తుత సచివాలయానికి వాస్తు సరిగా లేదని.. దీంతో కొత్త సచివాలయాన్నినిర్మించాలని తెలంగాణ రాష్ట్ర సమితిప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంపై పలు విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ భవనాలకు వాస్తు ఏమిటని కొందరు ప్రశ్నించగా.. కేసీఆర్ తలతిక్క పనులు చేస్తున్నాడని మరికొందరు విరుచుకుపడ్డారు.

ఇక ఎర్రగడ్డలో కొత్త భవనం నిర్మిస్తే అక్కడ కూడా వీధిపోట్లు తప్పవనే అభిప్రాయాలు వినిపించాయి. అలాగే ఈ విషయంలో కొందరు కోర్టుకు కూడా ఎక్కారు. వాస్తుదోషం పేరుతో ప్రజాధనం వృథా చేస్తున్నారని అంటూ వారు కోర్టులో ఫిర్యాదు చేశారు. ఇలాంటి అడ్డంకుల నేపథ్యంలో ప్రభుత్వం ఏమైనా వెనక్కుతగ్గుతుందేమోనని అందరూ అనుకొన్నారు.

అయితే బడ్జెట్ ప్రకటనతో ఆ విషయంపై స్పష్టత వచ్చింది. ప్రభుత్వం వెనక్కు తగ్గడం లేదు.. విమర్శలను లెక్క చేయడం లేదని స్పష్టం అయ్యింది. తొలిదశగా 150 కోట్ల రూపాయలతో కొత్త సచివాలయ నిర్మాణ పనులు మొదలుపెట్టేలాగానే ఉన్నారు. మరి కేసీఆర్ నిర్ణయమా.. మజాకా!

మరింత సమాచారం తెలుసుకోండి: