కృషి ఉంటే మనుషులు రుషులవుతారు మహా పురుషులవుతారు అంటూ అప్పట్లో మన తెలుగు సినిమాలో పాట ఎంత అర్థవంతంగా ఉంటుందో వేరే చెప్పాల. మనిషి పుట్టింది జీవితంలో ఏదైనా సాధించడానికి అంటూ మహా పురుషులు చెబుతుంటారు.

మరి మనిషి తల్చుకుంటే ఏదైనా సాధించవచ్చు అనటానికి ఉదాహారణ నేడు మనం వాడుతున్న యాంత్రిక వస్తువు నుంచి మని గుండె తీసి గుండె అమర్చేస్థాయి వరకు. మన భూమండంలోనే కాదు ఇతర గ్రహాలపై కూడా తన ముద్ర వేస్తూ ఎన్నో పరిశోధనలు జరుపుతూ వస్తున్నాడు. అల్లంత దూరాన కనబడే చంద్రుని వద్దకు కూడా వెళ్లి వచ్చాడు.

తాజాగా అంతర్జాతీయ అంతరిక్షం నుండి ముగ్గురు వ్యోమగామలు క్షేమంగా భూమి చేరారు. అంతరిక్ష కేంద్రంలో 167 రోజుల పాటు పలు పరిశోధనలు చేసిన వీరు కజక్ స్టెప్పీ భూముల్లో జాగ్రత్తగా దిగారు. నాసాకు చెందిన ఓ ఆస్ట్రోనాట్ వీరిలో ఉన్నాడు.

రష్యాకు చెందిన ఇద్దరు కాస్మోనాట్‌లు కూడా ఉన్నారు. నాసా స్టేషన్ కమాండర్ బారీ విల్‌మోర్, రష్యాకు చెందిన ఇద్దరు ఫ్లెట్ ఇంజనీర్లు అలెగ్జాండర్ సమాకుట్యేవ్, ఎలోనా సెరోవాలు నిటారుగా వాలిన ఓ కాప్స్యూల్‌లో సెంట్రల్ కజకిస్తాన్‌లోని జెజ్‌కజ్‌గాన్ పట్టణ సమీపంలో దిగారు. ఈ విధంగా అంతరిక్షాన్ని అడుగిడి క్షేమంగా భువికి చేరుకున్న వారికి శుభాకాంక్షలు..

మరింత సమాచారం తెలుసుకోండి: