టెక్నాలజీ రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. సరిగ్గా వాడుకుంటే బానిసలా పనిచేస్తుంది.. దుర్వినియోగం చేస్తే.. యజమానిలా మారి పతనానికి దారి తీస్తుంది. ఇదే సూత్రం సోషల్ మీడియాకు కూడా వర్తిస్తుంది. ఫేస్ బుక్, వాట్సప్ వంటి సోషల్ మీడియాను సరిగ్గా వాడుకుంటే.. అద్భుత ఫలితాలు సాధించవచ్చని హైదరాబాద్ పోలీసులు రుజువు చేస్తున్నారు.

ఊరికే ఛాటింగ్.. అవసరంలేని ఫోటోలు, వీడియోలు పంపించుకునేందుకు కాకుండా.. ఓ సోషల్ కాజ్ కోసం హైదరాబాద్ పోలీసులు ఉపయోగిస్తున్నారు. ప్రజలతో సన్నిహతమయ్యేందుకు.. భాగ్యనగర పోలీసులు గత నెల 20నుంచి వాట్సప్ ఉపయోగిస్తున్నారు. 9490617444 నెంబర్ కేటాయించి.. ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు.

ఇప్పటివరకూ దాదాపు మొత్తం 7500 వరకూ మెస్సేజ్ లు అందాయి. పొల్యూషన్ పెరిగిందని.. న్యూసెన్స్ చేస్తున్నారని.. ఈవ్ టీజర్లు ఇబ్బంది పెడుతున్నారని.. ఇలా ఎన్నో సమస్యలు.. వీటిని పోలీసులు ఓ క్రమపద్దతిలో సాల్వ్ చేస్తున్నారు. వాట్సప్ జనం కోసమే కాదు.. పోలీసుల్లో పోలీసులకు కమ్యూనికేషన్ కు కూడా చాలా బాగా ఉపయోగపడుతోందట.

ఎవరైనా ఇబ్బంది పెట్టినా.. న్యూసెన్స్ చేసినా.. వేధిస్తున్నా.. జస్ట్ వీలైతే ఓ ఫోటో కొట్టండి.. వాట్సప్ కు పోస్ట్ చేయండి. అంతే మిగతా పని పోలీసులు చూసుకుంటారు. ఈమధ్య ఇళ్ల మధ్యో బోరింగ్ వేస్తూ.. సౌండ్ పొల్యూషన్ తో చంపేస్తున్నారట. ఒకాయన ఫోటో తీసి వాట్సప్ లో పెట్టేశాడు.. మరో దగ్గర తాగుబోతులు అల్లరి చేస్తున్నారు. ఓ క్లిక్.. ఓ పోస్ట్.. అంతే వాళ్ల కట్టయ్యింది. ఇలాంటి ఉదాహరణలెన్నో ఉన్నాయట. ఈ సంగతీ పోలీసులే చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: