దక్షిణాన కర్ణాటకలో పాగా వేసిన భారతీయ జనతా పార్టీకి అనుకున్నట్లుగానే తెలంగాణా అంశం కలిసొచ్చే లాగే ఉంది. నాగం జనార్ధన్ రెడ్డి ఇప్పటికిప్పుడు భాజపాలో చేరక పోయినా ఒక విధంగా వారితో చర్చలు జరపడం వల్ల ఈ ప్రాంతంలో వారికి ఇక ఎంత ప్రాధాన్యత ఉంటుందో చెప్పకనే చెప్పాడు. భాజపా తమ నేతలను ఎక్కడ లాక్కుంటుందో అన్న గుబులుతో గులాబీ దళం సైతం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. తెలంగాణా విషయంలో తమకు మాత్రమే చిత్తశుద్ధి ఉందని, జాతీయ పార్టీ అయిన భాజపా ప్రత్యేక రాష్ట్రాన్ని తప్పక అందిస్తుందని అంటోంది. అటు కాంగ్రెస్ అవమానం, ఇటు బాబు యాత్ర, షర్మిల యాత్ర, జగన్ పార్టీ ఆకర్షల మధ్య సతమతం అవుతున్న తెరాస భాజపాను కూడా దూరం చేసుకుంది, ఒక విధంగా కేసిఆర్ ను దోషిగా చూపించి తెలంగాణాలో పార్టీని అద్భుతంగా బలోపేతం చేసే యోచనను కమలనాథులు అమలులో పెట్టేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: