కరీంనగర్ లో జరిగిన మేధోమధనం తెరాసను కష్టాలనుండి ఒడ్డున పడేసిందా అంటే లేదనే చెప్పాలి. ఇంకా పైపెచ్చు 2014 ఎన్నికల్లో తెలంగాణాలోని దాదాపు అన్ని సీట్లను కైవసం చేసుకుంటామని కేసిఆర్ అన్నా ఈ ప్రాంతంలో ఆ పార్టీ కు ఉన్న పట్టు సడలినట్లేనని అనిపిస్తోంది. తెలంగాణా కోసం ఆత్మ హత్య చేసుకున్న సంతోష్ మృతికి నిరసనగా ఉస్మానియా జేఎసి బంద్ కు పిలుపినిచ్చినా ఎక్కడా విద్య సంస్థల నుండి స్పందన లేదు. డెడ్లైన్ల మీద డెడ్లైన్లు పెట్టిన చంద్ర శేఖర్ రావు ఇప్పుడు అవన్నీ మర్చిపొమ్మంటున్నాడు , కాంగ్రెస్ దగా చేసింది , ఇక వారిని నమ్మడం లేదని సారు ఎంత సెలవిచ్చినా ఆయనను ఇప్పుడు ఎవ్వరూ నమ్మే పరిస్థితులలో లేరు. జగన్ రెడ్డిని , బాబును ఎంత తిట్టినా సోనియా గాంధీ గురించి పల్లెత్తు మాట అయినా అనలేదు కేసిఆర్ . ఇంతా చూస్తుంటే మళ్లీ ఎప్పుడు ఢిల్లీ పిలుపొచ్చినా ఈయన పోరు అన్న గ్యారంటీ లేదు. అందుకే ఇక ఈయనను నమ్మే పరిస్తితులు అస్సలు లేవని తెరాస శ్రేణులే చెబుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: