ఏపీ రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజీని ప్రకటిస్తుందని తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బోలెడన్ని ఆశలు పెట్టుకొని ఉన్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్పష్టం చేశాడు. తాను ఆశావాదినంటూ బాబు తన ఆశలను వివరించాడు. అయితే కేంద్రం మాత్రం ఏదో కొంతవిదిల్చి చేతులు దులుపుకొంటోంది.

ఈ నేపథ్యంలో ఇటీవల ఏపీ రాజధాని కోసం అంటూ వెయ్యి కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్టుగా ఒక ప్రకటన వచ్చింది. అయితే.. ఇప్పుడు వెయ్యి కోట్ల రూపాయల విషయంలో కూడా వెయ్యి తిరకాసులున్నాయని తెలుస్తోంది. ఏపీ రాజధాని పేరుతో కేటాయించడ్డ నిదులను కేవలం తూళ్లూరు ప్రాంతంలోనే ఖర్చు చేయడం ఏమిటి? అని అంటున్నారు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు.

ఈ విషయంలో ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ... ఆ నిధులను విజయవాడ,గుంటూరు నగరాభివృద్ధికి కూడా ఖర్చు చేయాలని వెంకయ్య వ్యాఖ్యానించాడు. కేంద్రంలో పట్టణాభివృద్ధి శాఖ హోదాలో ఉన్న వెంకయ్య ఇలా వ్యాఖ్యానించడం విశేషమే!

ఇచ్చిన ముష్టి వెయ్యి కోట్ల గురించి వెంకయ్యనాయుడు ఇలా మాట్లాడటాన్ని చూస్తుంటే.. ఆ డబ్బును ఆయన మంత్రిత్వ శాఖ అండర్ లోనే ఖర్చు పెట్టే యోచనలో ఉన్నట్టున్నారు. మరి ఇలా ఇచ్చిన తక్కువస్థాయి నిధులపై కూడా కేంద్ర ప్రభుత్వం అజమాయిషీ చేస్తే.. ఆ డబ్బుపై బాబుకు అధికారం ఇవ్వకపోతే.. తెలుగుదేశం అధ్యక్షుడి కలల రాజధాని నిర్మాణం ఎలా సాధ్యం అవుతుంది?!

మరింత సమాచారం తెలుసుకోండి: