ఈ మధ్య ఆంధ్రా అసెంబ్లీ సమావేశాల సమయంలో తరచూ ఏబీఎన్ ఛానల్ పేరు వినిపిస్తోంది. ప్రత్యేకించి ప్రతిపక్షపార్టీకి చెందిన నాయకులు ఎక్కువగా ఎబీఎన్ తమ గొంతు నొక్కుతోందని మండిపడుతున్నారు. ఏబీఎన్ అనేది తెలుగులోని అనేకానేక న్యూస్ ఛానళ్లలో ఒకటి. మరి అదెలా ప్రతిపక్షాల గొంతునొక్కుతుంది..

ఈ విషయం తెలుసుకోవాలనంటే అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాల గురించి కాస్త తెలుసుకోవాలి. లోక్ సభ, రాజ్యసభ టీవీల తరహాలో ఏపీలో ప్రభుత్వానికి సొంత ఛానల్ లేదు. అందువల్ల అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాల కోసం ఓ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు. అదే కాంట్రాక్టు వ్యవస్థ. అంటే అసెంబ్లీ సమావేశాలను మిగిలిన ఛానళ్లకు లైవ్ సమకూర్చేందుకు ఏర్పాటైన ఓ కాంట్రాక్టు అన్నమాట.

చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యంతో ఏబీఎన్ ఛానల్ యాజమాన్యం ఆ కాంట్రాక్టును దక్కించుకున్నదని ఓ టాక్ నడుస్తోంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతికీ వై.ఎస్.జగన్ కూ ఉన్న వైరం ఈనాటిది కాదన్నది తెలుగు రాజకీయాలు, పత్రికల పోకడల సంగతి ఏమాత్రం తెలిసిన వారికైనా బోధపడుతుంది. సహజంగా అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాల సమయంలో విపక్షాలు ఆందోళన చేసేటప్పుడు కేవలం స్పీకర్ ను చూపిస్తుంటారు.

ఇలాంటి పోకడ గతంలోనూ ఉన్నదే. ఇప్పటి కాంట్రాక్టు సంస్థ కూడా అలాగే చేస్తోంది. అదే ప్రతిపక్ష నాయకులకు మంట తెప్పిస్తోంది. అందుకే తనకు మైక్ కట్ అయినప్పుడల్లా జగన్ ఏబీఎన్ ను తిట్టడం అలవాటుగా చేసుకున్నారు. బుధవారం కూడా సేమ్.. జగన్ మాట్లాడుతున్న సమయంలో మంత్రి దేవినేని మాట్లాడటం మొదలు పెట్టగానే జగన్ మైక్ కట్ అయ్యింది. దాంతో చిరాకెత్తిన జగన్.. ఈ ఏబీఎన్ వాళ్లకు మరీ ఎక్కువైంది.. మైక్ ఊరికే కట్టవుతా ఉంది.. అంటూ సెటైర్ వేసేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: