మైనింగ్ స్కామ్.. తో ఉక్కిరిబిక్కిరి అవుతోంది డీకే అరుణ కుటుంబం. ఏడాది కిందట డీకే అరుణ ప్యామిలీ మైనింగ్ వ్యవహారంపై కోర్టులో దాఖలు అయిన పిల్ పై ఇప్పుడిప్పుడే విచారణ ఊపందుకొంటోంది. ఈ విచారణలో భాగంగా గనుల శాఖ అధికారులు కోర్టుకు ఇచ్చిన సమాచారంతో డీకే అరుణ ఫ్యామిలీకి తిప్పలు తప్పవని తెలుస్తోంది. అరుణ కుటుంబం ఆధీనంలో ఉన్న మైనింగ్ వ్యవహారాల్లో అక్రమాలున్నాయని అధికారులు తేల్చారు.

ఈ విషయాన్ని వారు కోర్టుకు నివేదించారు. డీకే అరుణ భర్త భరత సింహారెడ్డి, వీరి కూతురు స్నిగ్ధారెడ్డిల పేర్ల మీదున్న మైనింగ్ లీజుల్లో అక్రమాలున్నాయని ఏడాది కిందట హైకోర్టు లో పిటిషన్ పడింది. ఈ విషయాన్ని ఇప్పుడు అధికారులు కూడా గుర్తించారు. ఈ అంశం గురించి తాము ఎప్పుడో నోటీసులు కూడా జారీ చేశామని..కూడా వారు తెలిపారు.

దీంతో అధికారాన్ని అడ్డం పెట్టుకొని డీకే అరుణ ఫ్యామిలీ అక్రమమైనింగ్ కు పాల్పడిందనే విషయం హైలెట్ అవుతోంది. ఈ విషయం గురించి కోర్టుడు డీకే ఫ్యామిలీ తరపు లాయర్ల నుంచి వివరణ కోరింది. అయితే తాము ఇప్పడు సమాధానం చెప్పలేమని.. దీనికి కొంత గడువు కావాలని కోర్టును వారు కోరారు.

స్థూలంగా ఈ వ్యవహారం ఏదో తీవ్రస్థాయికే చేరేలా ఉంది. ఎలాగూ కేసీఆర్ ప్రభుత్వం డీకే అరుణ ఫ్యామిలీని ముప్పుతిప్పలు పెట్టే అవకాశం ఉంది కాబట్టి.. అక్రమమైనింగ్ వ్యవహారం ఎలాంటి మలుపు తీసుకొంటుందో చూడాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: