అంగన్ వాడీలకు జీతం పెంపు అనేది.. తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీల్లో ఒకటి! తాము అధికారంలోకి వస్తే అంగన్ వాడీల జీతాలను పెంచేస్తామని ఎన్నికల ముందు తెలుగుదేశం వాళ్లు గట్టిగా ప్రచారం చేశారు. డ్వాక్రా రుణమాఫీ.. రైతు రుణమాఫీ వంటి అంశాలను హైలెట్ చేసిన తెలుగుదేశం వాళ్లు అంగన్ వాడీలను కూడా ఇలాంటి హామీలతో ఆకట్టుకొన్నారు.

అయితే తీరా అధికారంలోకి వచ్చాకా మాత్రం ఇప్పటి వరకూ అంగన్ వాడీల జీతాలు పెరగలేదు. ఒకవైపు తెలంగాణ సర్కారు అంగన్ వాడీల జీతాలను పెంచేసింది. ఈ నేపథ్యంలో ఏపీలోని అంగన్ వాడీ మహిళలు కూడా తమ జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి వారు హైదరాబాద్ లో ధర్నాకు దిగారు.

అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని అంగన్ వాడీ కార్యకర్తలను చెదరగొట్టడానికి ప్రయత్నించారు. ఈ పనిలో భాగంగా మహిళలను ఈడ్చిపడేయానికి వారు వెనుకాడ లేదు. మరి బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలా మహిళలను ఈడ్చిపడేయడం అనేది కొత్త కాదు!

వెనుకటికి కూడా అంగన్ వాడీలను గుర్రాలతో తొక్కించడం జరిగిందని బాబు వైరి పక్షాలు ఆరోపిస్తున్నాయి. అప్పట్లో కూడా బాబు అచ్చం ఇలాగే వ్యవహరించాడని.. అంగన్ వాడీలను అణిచి వేయడానికి ప్రయత్నించాడని వారు గుర్తు చేస్తున్నారు. బాబు అధికారంలో ఉంటే.. ఇలాంటి వన్నీ రొటీన్ అనుకోవాల్సి వస్తోందని అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: