ఇప్పుడు ప్రపంచంలో టెక్నాలజీ మనిషి ఎంత బాగా వినియోగించుకుంటున్నాడో వేరే చెప్పనవసరం లేదు. మనిషి కనిపెట్టిన ప్రతి ఒక్క ఐటమ్ తో మనిషి జీవితం ఎంత సుఖమయం అవుతుందో అందరికీ తెలుసు. ముఖ్యంగా సోషల్ నెట్ వర్క్ లో మనిషి ఎంతో ప్రగతి సాధించాడు.

సోషల్ నెట్ వర్క్ లో అందరూ యూజ్ చేసేది యూట్యూబ్ కంప్యూటర్ పై కనీసం నాలెడ్జీ ఉన్నవారికి యూట్యూబ్ తెలియనివారు ఉండరు. ఇది సెల్ ఫోన్లో కూడా మనకు సులభంగా యూజ్ చేస్తుంటారు. యూట్యూబ్… ద మోస్ట్ వాచ్డ్ వీడియో సైట్… నో డౌట్! గూగుల్ సంస్థకు చెందిన ఈ సైట్ ఇప్పుడు సరికొత్తగా 360 డిగ్రీ వీడియోలు (రీచోస్ తీటా, కోడాక్ పిక్స్ ప్రో ఎస్పీ360 వంటి ప్రత్యేక కెమెరాలతో తీసిన వీడియోలు) అప్ లోడ్ చేసుకునేందుకు వీలుగా మార్పులు తీసుకొస్తొంది.

ఆండ్రాయిడ్ మొబైల్ లో యూ ట్యూబ్ యాప్ లో వీడియో ప్లే అవుతున్నప్పుడు ఫోన్ కానీ టాబ్లెట్ కానీ అటూ ఇటూ తిప్పడం వల్ల వివిధ కోణాలు చూడగలుగుతాం. అలాగే యూట్యూబ్.కామ్ లో ఈ ఎఫెక్ట్ ద్వారా మౌస్ ఉపయోగించి వ్యూ పాయింట్ నుండి డ్రాగ్ చేస్తే చుట్టూ ఉన్న ప్రదేశం చూడగలుగుతాం.

దీనికి బుబల్ కామ్, గిరోప్టిక్స్ 360 కామ్, ఐసీ రియల్ టెక్స్ ఎలై, కోడాక్స్ ఎస్పీ360, రీచోస్ తీటా కెమెరాలు అనువైనవిగా కంపెనీ చెపుతోంది. అలాగే వీడియోస్ ఎలా అప్ లోడ్ చేయాలో స్క్రిప్ట్ ద్వారా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుందట. ఐఫోన్, ఐ పాడ్ లాంటి డివైస్ లలో టెస్ట్ చేయాడానికి ఈ ఫీచర్ రెడీ అయిందని చెప్పారు

మరింత సమాచారం తెలుసుకోండి: