కేరళ అనంతపద్మనాభ స్వామి ఆలయం గురించి తెలిసే ఉంటుంది. అక్కడి నేలమాళిగలో లక్షల కోట్ల విలువైన సంపద ఉందని చాలా కథనాలు వచ్చాయి. ఆ సంపద వెలికితీత వ్యవహారం సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. ఇంకా కోర్టు చిక్కుల్లోనే ఉండిపోయింది. 

ఇప్పుడు అలాంటిదే మరో ఆలయం వ్యవహారం వెలుగు చూసింది. తమిళనాడులోని శ్రీరంగనాథ ఆలయంలోనూ ఇలాంటి గుప్త నిధులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ గుళ్లోనూ.. రహస్య గది, నేల మాళిగ ఉన్నాయట. అక్కడ ఇంకా మరికొన్ని సీక్రెట్ ప్లేసులు ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఈ రహస్యాలను ఛేదించేందుకు తమిళనాడు ప్రభువం నడుంబిగించింది. రహస్య గదులని భావిస్తున్న ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతోంది. ఇంతకీ ఇన్నాళ్లకు ఈ విషయం ఎలా వెలుగులోకి వచ్చిందనేగా మీ సందేహం.. ఇక్కడ త్వరలో కుంభాభిషేకం నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా ఆలయ పునరుద్ధరణ పనులు మొదలుపెట్టారు. 

ఈ పనుల సమయంలోనే ఈ రహస్య ఏర్పాట్లు వెలుగు చూశాయట. ఆలయంలోని వేణుగోపాల సన్నిధిని బండరాళ్లతో, మహా మండపం లోపల కుడివైపు  గోడను మట్టితో నిర్మించిన విషయాన్ని అధికారులు గుర్తించారు. మట్టిగోడపై ధన్వంతరి పేరుమాల్ చిత్రం ఉంది. మట్టి గోడను తొలగించేసరికి ఓ సీక్రెట్ రూమ్ ఓపెనైందట. అక్కడ ఉన్న ఓ చోట చదరపు బండరాయి కింద పన్నెండు అడుగుల లోతైన నేలమాళిగ కూడా ఉందట. మరి వీటిలో ఏదైనా సంపద దాగి ఉందా.. ఉంటే ఇన్నాల్లూ పాలకులు,నాయకులు, దొంగల పాలుకాకుండా ఉంటుందా అని జనం ఆశ్చర్యపోతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: