ఇది వరకే శ్రీకాంతాచారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు.. ఇప్పుడు ఐలమ్మ విగ్రహానికి నిప్పు పెట్టారు... మూర్ఖులే ఇలాంటి పనులు చేస్తారనడానికి వెనుకాడక్కర్లేదు. అయితే పోరుగడ్డ తెలంగాణలో ఇలాంటి దుశ్చర్యలు జరుగుతుండటం మాత్రం దురదృష్టకరం. గౌరవంతో చూసుకోవాల్సిన వారి విగ్రహాలు ధ్వంసం చేయడం నీఛమైన సంప్రదాయం. అది కూడా ప్రారంభానికి ముందు  ఇలాంటి చర్యలు జరుగుతున్నాయనే విషయాన్ని ఇక్కడ గమనించాలి.


తెలంగాణ పోరాటంలో ఆత్మహుతి అయిన శ్రీకాంతాచారి

తెలంగాణ పోరాటంలో ఆత్మహుతి అయిన వ్యక్తి శ్రీకాంతాచారి. ప్రత్యేక రాష్ట్రం తీవ్రస్థాయికి వెళ్లడంలో రాజకీయ నాయకుల కన్నా శ్రీకాంతాచారి వంటి వారిదే ప్రముఖ పాత్ర. మరి అలా ఆత్మహుతికి పాల్పడ్డ శ్రీకాంతాచారికి కానీ, ఆయన కుటుంబానికి ఇప్పటి వరకూ పెద్దగా దక్కిందేమీ లేదు. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఎన్నికల్లో పోటీ చేస్తే ఆమెకు విజయం దక్కలేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సిద్ధించాకా శ్రీకాంతాచారి సొంతూళ్లో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టింపజేయాలని స్థానికులు నిర్ణయించారు. అంతా కలిసి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.. మర్నాడే ప్రారంభం అనుకొన్నారు. అంతలోనే రాత్రి పూట కొందరు దుండగులు ఆ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అమరుడు శ్రీకాంతాచారి సొంత ప్రాంతంలోనే అలా జరిగింది.


తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటయోధురాలు చాకలి ఐలమ్మ


తాజాగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటయోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఇలానే ధ్వంసం చేశారు. పాలమూరులో త్వరలోనే ఆవిష్కృతం కావాల్సిన ఈ విగ్రహానికి నిప్పుపెట్టారు. కిరోసిన్ పోసి దుండగులు నిప్పుపెట్టి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. 


తెలంగాణ


ఏ సీమాంధ్రుల విగ్రహాల్లో ధ్వంసం చేశారంటే.. దానికి ఏదో ఒక సమాధానం చెప్పవచ్చు కానీ.. తెలంగాణలో ఇలా సొంత పోరాట యోధుల విగ్రహాలే ధ్వంసం కావడం దురదృష్టకరం. అయినా ఇలాంటి చర్యల వల్ల మరణించిన వారికి అయితే ఎటువంటి నష్టం లేదు. బతికున్న వారికే అసలైన అవమానం. 



మరింత సమాచారం తెలుసుకోండి: