ఇండియా టీమ్  వరల్డ్ కప్ 2015 బరిలో దిగిన ప్రతి సారి విజయ ఢంకా మోగిస్తూ వస్తున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగుతుండడంతో ఇరు జట్లలు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయారు. మొదటి నుంచి దూకుడుగా ఆడుతున్న టీమ్ ఇండియా పై అందరికీ నమ్మకం ఉంది. దోనీ సేనా ప్రాక్టీస్ చాలా సీరియస్ గా కొనసాగుతుంది. 

టీమ్ ఇండియాతో కరచాలనం చేస్తున్న ఆల్ రౌండర్ ఫాల్కనర్ (ఫైల్)


ఈ సందర్భంగా ఆస్ట్రేలియా టీమ్ ఆల్ రౌండర్ ఫాల్కనర్ మాట్లాడుతూ టీమిండియాను నిలువరించడం కష్టమేనని, సెమీస్ లో తమకు గట్టిపోటీ తప్పదని భారత్ ను తక్కువగా అంచనా వేయడం లేదని ఫాల్కనర్ అన్నాడు. భారత బౌలింగ్ పటిష్టంగా ఉందని, ఈ మ్యాచ్ లో స్పిన్ బౌలింగ్ పెద్దగా ప్రభావం చూపబోదని ఫాల్కనర్ అభిప్రాయపడ్డాడు.


ప్రస్తుతం వరల్డ్ కప్ 2015 లో ఆడుతున్న ఇండియా టీమ్


టీమ్ ఇండియా లో మంచి బౌలర్లు, బ్యాట్స్ మెన్ లు చాలా చక్కటి పర్ఫామెన్స్ ఇస్తున్నారు. భారత బౌలర్లు అశ్విన్, జడేజా ప్రపంచ స్థాయి స్పిన్నర్లయినా, సిడ్నీ వికెట్ స్పిన్ కు అనుకూలించదని తెలియజేశాడు.   భారత్ తో సెమీస్ మ్యాచ్ తమకు ఫైనల్ లాంటిదని ఆసీస్ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అన్నాడు. భారత్, ఆసీస్ ల మధ్య ఈ నెల 26న సిడ్నీలో సెమీ ఫైనల్ జరగనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: