భారతదేశంలోని జనాల సమస్యల్లో 90 శాతం ఆర్థిక సమస్యలతో ముడిపడినవే. డబ్బు ఒక్కటే చాలా మంది సమస్యలను తీర్చగలదు. తమకు అవసరానికి తగిన డబ్బు లభించినా చాలా అభ్యున్నతిని సాధించగలమని.. దూసుకుపోగలమని నమ్ముతున్న వారి సంఖ్య పదుల కోట్లలో ఉంటుంది!


వారందరి సంగతి ఎలా ఉన్నా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం తన రాష్ట్ర పరిధిలోని జనాల వ్యక్తులపై దృష్టి సారించినా చాలు చాలా మంది బాగుపడిపోతారు. తాజాగా కేసీఆర్ సల్వా పాతిమా అనే మహిళకు కమర్షియల్ పైలెట్ కోర్సును అభ్యసించడానికి 35.5 లక్షల రూపాయలను సాయంగా అందించాడు. తన వ్యక్తిగత అభిలాషను నెరవేర్చుకోవడానికి అవసరమైన డబ్బు లేక ఇబ్బంది పడుతున్న ఆమెకు సాయంగా నిలిచాడు.


మరి ఏదో సమూహం కోసం ఆర్థిక సాయం చేయడం కాకుండా.. ఇలా వ్యక్తిగత లక్ష్యాలను సాధించుకోవడానికి కూడా ఆర్థిక సాయం చేయగల విశిష్ట సీఎంగా కేసీఆర్ నిలిచాడు. అయితే ఇది కేవలం ఫాతిమా దృష్టిలో మాత్రమే. ఇప్పుడు కేసీఆర్ వైపు ఆశగా చూస్తున్నవారెంతో మంది ఉన్నారు.


తమ తమ వ్యక్తిగత లక్ష్యాలను సాధించుకొని తాము బాగుపడి దేశానికి కూడా సేవ చేయాలని కోరుకొనే వారు తెలంగాణలోనే కోట్ల మంది ఉంటారు. అలాంటి వారిలో ప్రస్తుతానికి ఫాతిమకు లక్కీ ఛాన్స్ తగిలింది. ఇదే రకంగా తమకూ కేసీఆర్ ఆర్థిక సాయం ఇచ్చి ప్రోత్సహిస్తే మేలను కొనేవారికి కూడా తెలంగాన సీఎం ఇలా ఆర్థిక సాయం చేస్తే మంచిదే కదా! కేసీఆర్ ఆ పనిచేయగలరా మరి?


మరింత సమాచారం తెలుసుకోండి: