ఎన్ని "ప్రజాస్వామ్య వ్యతిరేక పనులు" చేసినా...తన నోట వెంట ఒప్పుకోని వారిలో ముందు వరుసలో ఉండేది రాజకీయ నాయకులే. నోరు తెరిస్తే వారు చెప్పేది రాజ్యాంగం ఎక్సెట్రా..ఎక్సెట్రా.కానీ చేసేవన్నీ వాళ్లకు పనికి వచ్చే పనులు. అలాంటి నాయకులు తమకు చిన్న ఇబ్బంది ఎదురైతే చాలు చిర్రెత్తుకొస్తుంటారు. నిజం ఒప్పుకోని...అబద్దాన్ని అందంగా చెప్పగలిగే నాయకుల్లో అగ్రగణ్యుడు మన పొరుగుదేశం నాయకుడు చంద్రబాబునాయుడు. అలాంటి చంద్రబాబు నాయుడుకు అవమానం జరిగింది. ఇదేమి మనం..మనం అనుకుంటున్న ముచ్చట కానే కాదు.. సాక్షాత్తు ఆయన చెప్పిందే.


కాంగ్రెస్ నుంచి దిగుమతి చేసుకున్న చైతన్యరాజు


ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే . ఇందులో ఉభయ గోదావరి జిల్లాల తరఫున కాంగ్రెస్ నుంచి దిగుమతి చేసుకున్న చైతన్యరాజు అనే వ్యక్తిని చంద్రబాబు బరిలో దించారు. గతంలో ఎమ్మెల్సీ కావడం, ఫుల్ క్యాష్ పార్టీ అవడంతో ఎలాగైనా గెలుస్తాడని బాబు ధీమాగా ఉన్నారు.

కమ్యూనిస్టులు బలపర్చిన సూర్యారావు

అయితే చిత్రంగా ఆయన కమ్యూనిస్టులు బలపర్చిన సూర్యారావు అనే నాయకుడి చేతిలో ఓడిపోయారు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న సమయంలో హైదరాబాద్ లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశం ఏర్పాటు చేసి తన అక్కసు, ఆవేశం అంతా చల్లార్చుకున్నారు.


నేను అవమానంగా ఫీలవుతున్నా: చంద్రబాబునాయుడు


"మీకు ఎలా ఉందో కానీ నేను అవమానంగా ఫీలవుతున్నా" అంటూ ఆ మీటింగ్ లో అసహనం వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆ రెండు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఓట్లు వచ్చాయని పేర్కొంటూ ఇపుడెందుకు వారు ఓట్లేయదని ప్రశ్నించారు. ఉద్యోగులు సైతం దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు బాబు. అభ్యర్థి ఎంపిక సరికాదేమో అని కొందరు చెప్తే ఇప్పుడు చెప్తున్న వారు ముందుగా ఆ విషయం తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని మండిపడ్డారు.నాయకులు పనిచేయడంలో రాజీ పడకుండా ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీలో మంత్రులు, ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకొని పనిచేయాలని సూచించారు.



ఈ ఫలితం టీడీపీకి పెద్ద షాక్ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలకే టీడీపీకి చేదు అనుభవం ఎదురైంది. టీడీపీకి కంచుకోటగా చెప్పుకుంటున్న ఆ జిల్లాలలో ఓటమి ఆ పార్టీకి గట్టి దెబ్బగా కనిపిస్తోంది.మొత్తానికి చంద్రబాబు ఎన్నికల తర్వాతి మొదటి అవమానం ఆ విధంగా జరిగిందన్నట్లు. 


మరింత సమాచారం తెలుసుకోండి: