తెలుగుదేశం పార్టీ రాజకీయంపై తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వృద్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు అన్యాయం చేసిన ఆ పార్టీ తీరును నిరసిస్తూ వారు కోర్టుకు ఎక్కారు. తాము తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేయలేదని.. తెలుగుదేశంకు ఓటేయలేదని తమపక్ష కక్షసాధింపు చేస్తున్నారని అంటూ వృద్ధులు కోర్టుకు నివేదించారు. తమకు జరిగిన అన్యాయం గురించి వారు రాష్ట్ర అత్యున్నత స్థాయి న్యాయస్థానికి విన్నవించుకొన్నారు.

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు స్థానికులపై కక్ష సాధింపు చర్యలకు దిగినట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో తమకు అనుకూలంగా వ్యవహరించిన వారిపై వీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని కక్ష సాధిస్తున్నారట. ఎన్నికల్లో వైకాపాకు ఓటేశారనే నెపంతో కొప్పవరం అనే గ్రామంలోనే దాదాపు 50 మంది వృద్ధుల పెన్షన్లను కట్ చేశారు. వృద్ధాప్య పెన్షన్ పొందడానికి అన్ని అర్హతలూ ఉన్న వారిని ఆ జాబితా నుంచి తీసేశారని తెలుస్తోంది.

ఇలాంటి వారి సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా చాలానే ఉంది. ఆమధ్య పెన్షనర్ల జాబితాలో సవరణ సమయంలో అనేక మంది వృద్ధులు తమకు అన్యాయం జరిగిందని కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగారు. అయితే వారందరికీ భిన్నంగా అనపర్తి ప్రాంతా వృద్ధులు మాత్రం కోర్టుకు ఎక్కారు. తమకు అన్యాయం జరిగిన విధానాన్ని వారు న్యాయస్థానానికి విన్నవించుకొన్నారు.>> మరి ఇలా అధికారంలోకి వచ్చిన పార్టీ చేసిన అన్యాయంపై కోర్టుకు ఎక్కడ ఆసక్తికరమైన విషయమే. రాజకీయ కక్ష సాధింపులపై ఆధారాలను చూపుతూ వృద్ధులు న్యాయం చేయమని కోరుతున్నారు. మరి వీరి విషయంలో న్యాయస్థానం ఎలా స్పందిస్తుందో!

మరింత సమాచారం తెలుసుకోండి: