హైదరాబాద్ లో చర్లపల్లి సెంట్రల్ జైలుకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ జైలు జీవితం అనుభవించిన వారు బయటకు వచ్చి ప్రశాంతమైన జీవితం గడిపేవారు చాలా మంది ఉన్నారు. కారణం జైళ్లో నేర్చుకున్న పాఠాలు, క్రమశిక్షణ అలా ఉంటాయి. ఈ జైలుకు చాలా మంది ప్రముఖులు కూడా వెళ్లివచ్చారు. అందుకే చర్లపల్లి జైలుకి ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ ఇచ్చారు.


చర్లపల్లి జైలు పూర్తి చిత్రం.


కరడు కట్టిన తీవ్ర వాదులు, రాజకీయ ఖైదీలు, మావోయిస్టులు రక రకాల ఖైదీలకు కేంద్రంగా నిలిచింది. చర్లపల్లి సెంట్రల్ జైల్ 120 ఎకరాల (49 హెక్టార్లు)  విస్తీర్ణం కలిగి ఉంది.  ఇక్కడి జైళ్లో  15-20 ఎకరాల కూరగాయల వ్యవసాయ, పాడి హౌసెస్ మరియు ఒక 20 ఎకరాల ఆర్చర్డ్ మామిడి వ్యవసాయ, పాడి కార్యకలాపాలు ఖైదీ  ఉద్యోగులున్నారు.  అంతే కాదు ఇక్కడి ఉత్పత్తులు నగరంలోని ఇతర జైళ్ళ ఉపయోగిస్తారు. ఉత్తమ సేవలు అందించినందుకు చర్లపల్లి కేంద్ర కారాగారానికి ఐఎస్‌ఓ సర్టిఫికెట్ లభించింది. ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో సేవలు అందిస్తుండడంతో గుర్తించిన కమిటీ మూడు నెలలపాటు కేంద్ర కారాగారాన్ని అధ్యయనం చేసి, ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. కేంద్ర కారాగారంలో పరిశ్రమల పనితీరు, ఖైదీలకు అందిస్తున్న భోజనం, వారికి కల్పిస్తున్న సౌకార్యాలు, జైలులో పండిస్తున్న పంటలు, కేంద్ర కారాగారంలోని వివిధ పరిశ్రమల్లో ఖైదీలు తయారు చేస్తున్న ఉత్పత్తులు, ఖైదీలకు అందిస్తున్న వైద్య సేవలు, వివిధ బ్యారక్‌లో ఖైదీలకు అందిస్తున్న సేవలు, పారిపాలనా విభాగం పనితీరుపై అధ్యయనం చేసిన కమిటీ.. ఈ సర్టిఫికెట్ జారీ చేసిన్నట్లు కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ కొలను వేంకటేశ్వర్‌రెడ్డి చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: