నీతినిజాయితీకి మారుపేరుగా నిలిచే అధికారులు కొందరు ఉంటారు. వారిని ఎలాంటి పవర్ తోనూ కొనలేరు. కలెక్టర్ ఉద్యోగానికో అద్భుతమైన అవకాశం ఉంది. కలెక్టర్ డ్యూటీలో ఏం చేసినా.. సరే.. రాజకీయ నాయకులు అతని ఉద్యోగం మాత్రం పీకలేరు.

ఐఏఎస్ అధికారి తీరు పొలిటీషియన్స్ కు నచ్చకపోతే  మహా అయితే ట్రాన్స్ ఫర్ చేయగలరు. ఇంకా కావాలంటే సస్పెన్షన్ చేయించగలరు.. అంతే కానీ ప్రధానమంత్రి అయినా సరే.. ఐఏఎస్ ఉద్యోగిని ఉద్యోగం తీసేయలేరు. రాజ్యాంగ నిర్మాతలు ముందుచూపుతో పెట్టిన ఏర్పాటు అది.  

అశోక్ ఖేమ్కా.. నీతినిజాయితీ గల ఐఏఎస్ లలో ఆయన మొదటివరుసలో ఉంటారు. ఒకరకంగా చెప్పాలంటే గబ్బర్ సింగ్ ఐఏఎస్ అన్నమాట. యూపీఏ ప్రభుత్వం హయాంలోనే.. సాక్షాత్తూ సోనియా అల్లుడు రాబర్ట్  వాద్రా -డీఎల్ ఎఫ్ వివాదాస్పద  భూ  ఒప్పందాన్నే రద్దు చేశారు. సోనియాను, ఆమె అల్లుణ్నీ ముప్పుతిప్పలు పెట్టారు. ఆయన నీతి నిజాయితీలకు ప్రభుత్వాలు ఇచ్చిన బహుమతులు బదిలీలే.. 23 ఏళ్ల ఆయన సర్వీసులో ఇప్పటివరకూ 44 సార్లు బదిలీ అయ్యారు. 

అవినీతిని సహించలేని ఆయన్ను రాజకీయ నాయకులు కూడా సహించేవారు కాదు. తాజాగా ఆయన మరోసారి.. అంటే 45వసారి బదిలీ అయ్యారు. వాద్రా భూ ఒప్పందం విషయంలో అప్పటి కాంగ్రెస్  ప్రభుత్వానికి ఎదురునిలిచిన అశోక్  ఖేమ్కాకు... బీజేపీ మద్దతిచ్చింది. ఐతే.. ప్రస్తుతం హర్యానాలో అధికారంలో ఉన్న బీజేపీ రవాణాశాఖ మంత్రి విలాస్ వర్మకు, రవాణాశాఖ కమిషనర్ గా ఉన్న ఖేమ్కాకు పడటం లేదట. అంతే.. ఆయన్ను ప్రాధాన్యంలేని పురావస్తు, వస్తుప్రదర్శనశాలల  విభాగానికి బదిలీ చేసేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: