పింఛను పథకాన్ని సవరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం అనేక మంది రిటైర్డ్ ఉద్యోగులు, పింఛనుదార్లు ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు.ఆల్ పెన్షెనర్స అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంతో “నమ్మకద్రోహ దినాన్ని” పాటిస్తూ రిటైర్డ్ ఉద్యోగులు, పింఛనుదార్లు ధర్నాకు దిగారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, సంస్థలో కార్మికులుగా, ఉద్మోగులుగా, అధికారులుగా పనిచేసి రిటైర్ అయిన వారికి వృద్ధాప్యంలో పెన్షన్ వనితి కల్పిస్తూ 1995 లో ఆర్డినెస్సు ద్వారా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని కానీ ఈ పథకాన్నిసవరించి ప్రస్తుత పరిస్థితులు, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పింఛను చెల్లించడంలో ప్రభుత్వం హామీ ఇచ్చి అమలు చేయకుండా జాప్యం చేస్తుందని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం.ఎన్.రెడ్డి విమర్శించారు. తీరా ఇపిఎస్ 1995 పై నిపుణుల కమిటీ సిఫార్సు లను అంగీకరిస్తున్నట్లు ఆ సిఫార్సల మేరకు కనీస పింఛనును రూ.1000కి ఫిక్స్ చేయాలన్న దానిపై తర్వలో సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టిస్ నిర్ణయిస్తుందని చివరికి కేంద్ర కార్మికశాఖ మంత్రి పలుమార్లు ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. కానీ కేంద్రమంత్రి ప్రకటనకు భిన్నంగా నిపుణుల కమిటీ గత మేలో సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నరని, ఆ నిర్ణయాలు పింఛను దార్లను మోసం చేసే విధంగా ఉన్నాయని ఎస్.ఎన్.రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా బుధవారం దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టడమైందని, అందులో భాగంగానే ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడమైందని వారు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: