గోవాలోని ఫ్యాబ్ ఇండియా స్టోర్‌లో కేంద్రమంత్రి స్మృతి ఇరానికి ఎదురైన చేదు అనుభవం మరిచిపోకముందే, ఆ రాష్ర్ట సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ స్టోర్ యాజమాన్యం ఈ తప్పు చేసి వుండదని వ్యాఖ్యానించి మరో కొత్త వివాదానికి తెరతీశారు. యాజమాన్యం ప్రమేయం లేకుండా స్టోర్‌లో ఎవరో కొందరు ఉద్యోగులు చేసిన తప్పిదానికి మొత్తం షాపింగ్ మాల్ నిర్వాహకులనే తప్పు పట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారాయన. తనకి వ్యక్తిగతంగా ఫ్యాబ్ ఇండియా స్టోర్ గురించి బాగా తెలుసని, వారు కచ్చితంగా అటువంటి తప్పిదానికి పాల్పడరు అంటూ స్టోర్ యాజమాన్యాన్ని వెనకేసుకొచ్చారాయన.ఇదిలావుంటే, ఈ కేసుకు సంబంధించి స్టోర్ మేనేజర్ సహా నిందితులుగా ఆరోపణలు ఎదుర్కుంటున్న వారికందరికీ బెయిల్ మంజూరైంది. ఈ నేపథ్యంలో ఏకంగా కేంద్రమంత్రి బాధితురాలిగా వున్న కేసులోనే ఇలా జరిగితే ఇక సామాన్య మహిళలకు రక్షణ ఏం దొరుకుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: