ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ ను రీ షపుల్ చేయనున్నారా.. కొందరు మంత్రుల పెర్ ఫార్మెన్స్ పై అసంతృప్తిగా ఉన్నారా.. కొందరిని తొలగించడానికి అంతా రంగం సిద్ధం అయ్యిందా..  కొత్తగా మరికొందరికి కేబినెట్ యోగం పట్టనుందా.. ఇప్పుడీ చర్చ ఏపీ పొలిటికల్ సర్కిల్లో జరుగుతోంది. 

హైటెక్ ముఖ్యమంత్రిగా పేరున్న చంద్రబాబు.. ఎప్పటికప్పుడు తన పాలనపై సర్వే చేయించుకుంటున్నట్టు తెలుస్తోంది. కేవలం పాలనపై మాత్రమే కాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలపైనా పర్సనల్ సర్వేలు కూడా చేయిస్తున్నట్టు తెలుస్తోంది. వారి సమర్థతపైనే కాకుండా ఇతర ప్రవర్తనపైనా నిఘా పెట్టారట. 

ఇప్పుడా సర్వే ఫలితాల ఆధారంగానే కొందరిని కేబినెట్ నుంచి పంపేయాలని బాబు ఆలోచిస్తున్నట్టు టీడీపీ సర్కిల్లో బాగా ప్రచారం జరుగుతోంది. ఆల్రెడీ ఏడాది కావస్తున్న సమయంలో ఇంకా వారిపై ఉపేక్షించి లాభం లేదన్న అభిప్రాయానికి చంద్రబాబు వచ్చారట. పదవులు కోల్పోయే అవకాశం ఉన్న వారిలో మృణాళిని, నిమ్మకాయల చినరాజప్ప, పీతల సుజాత, రావెల కిషోర్ బాబు, పల్లె రఘునాధరెడ్డి పేర్లు ప్రముఖంగా ఉన్నాయట. 

అలాగే మరికొందరు పదవుల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. వివిధ సమీకరణాల కారణంగా వారికి పదవులు దక్కలేదు. రీషఫిలింగ్ జరిగితే.. తమకు అవకాశాలు దక్కుతాయని వారు ఎదురు చూస్తున్నారు. పదవులు దక్కించుకునే అవకాశం ఉన్న వారి జాబితాలో  కాల్వ శ్రీనివాసులు, మోదుగుల వేణుగోపాలరెడ్డి, కళా వెంకట్రావు, బండారు సత్యనారాయణ మూర్తి వంటి వారు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: